Friday, 4 November 2016

భర్త చితికి ఆంత్యక్రియలు చేసిన భార్య

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

ఏడడుగులు నడిచి... తనతో జీవితం పంచుకున్న భర్త చితికి భార్య కర్మకాండ నిర్వహించిన ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డికి చెందిన అవసుల రామకిష్టయ్య(80) మరణించాడు. రామకిష్టయ్య అంజమ్మ దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు. వారిద్దరికి వివాహం కావడంతో వారు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కట్టుకున్న భర్త రుణం తీర్చుకునేందుకు భార్య ఆంజమ్మనే భర్త పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.

No comments:

Post a Comment