Friday, 4 November 2016

మద్యం తాగి వాహనం నడిపినందుకు జైలుశిక్ష

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

మద్యం తాగి వాహనం నడిపిన కనకయ్య, రమేశ్ అనే వ్యక్తులకు మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ సెకాండ్ క్లాస్ మెజిస్తేట్ మహ్మద్ నజీర్ ఖాన్ తీర్పు నిచ్చినట్లు కోర్టు క్లర్క్ జైపాల్ తెలిపారు. వివరాలివీ... అశోక్నగర్ బోధన్ రోడ్డు నిజామాబాద్కు చెందిన కనకయ్య మద్యం తాగి వహనం నడపడంతో పాత ఎల్ఐసీ చౌరస్తా నిజామాబాద్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేయగా విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దేవి రోడ్ వద్ద మద్యం తాగి వాహనం నడిపిన గన్నారం తండాకు చెందిన రమేశ్ ట్రాఫిక్ పోలీసులకు దొరకడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఇద్దరిని సెకాండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చడంతో అయన వారిద్ద రికి మూడు రోజుల పాటు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

No comments:

Post a Comment