Friday, 4 November 2016

కార్యకర్తలు అధైర్యపడొద్దు… అండగా ఉంటాం: అరికెల

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా ఉండి నడిపిస్తున్న కార్యకర్తలు అధైర్యపడవద్దని, వచ్చే రోజులు మనకు మంచిగా ఉంటాయని. అన్నివిధాలా పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన నర్సారెడ్డి మాట్లాడుతూ, తెదేపా అధికారంలో లేకున్నా ఇతర పార్టీల్లోకి వలసపోకుండా తనకు అండగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పార్టీ సభ్యత్య నమోదును మరింత ఎక్కువగా చేపట్టాలన్నారు. గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగురవేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఇప్పటికే నమోదు ప్రారంభం ఆలస్యమైందని, రేపటి నుంచి మండల, గ్రామ పట్టణాలు, నగరాల్లో కార్యకర్తలు రంగంలోకి దిగి ఎక్కువ మొత్తంలో నమోదు చేయించాలని పేర్కొన్నారు ఇందులో కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఈసారి సభ్యత్వ నమోదు ఆన్లైన్లో ఉంటుందని, దీంతో పాటు చేయించుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఏ పార్టీలో లేని విధంగా తెదేపాలో బృంద బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టామన్నారు. కేసీఆర్ అధికారంలోకే రాక ముందు రూ 400 కోట్లు వెచ్చించి బోధన్ చక్కెర పరిశ్రమను తెరిపించి దానికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి అధికారంలో వచ్చాక పరిశ్రమను అమ్మేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపిం చారు. చక్కెర పరిశ్రమను తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకునే వరకు తెదేపా ఉద్యమిస్తోందని చెప్పారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్తురాలు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, తెదేపా అంటే ఆంధ్ర పార్టీ అని ప్రజల్లో ముద్ర ఉందనీ, దాన్ని తొలగించేందుకు ప్రజలకు చేరువ అయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బూటకపు సర్వేలతో మరోసారి అధికా రంలో వచ్చేందుకు తెరాస చూస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపెట్టె వ్యతిరేక విధానాలనుప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వి.మోహన్ రెడ్డి, ఉస్మాన్, సుభాష్రెడ్డి పోల సుధాకర్, గోపాల్నగేష్,వినోద్ కుమార్ రాజమల్ల, రెంజర్ల సురేష్ బాల్కిషన్, రత్నాకర్గౌడ్ పుప్పాల రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment