Friday, 4 November 2016

ఉపాధ్యాయుడి కుటుంబానికి పీఆర్టీయూ చేయూత

నవంబర్ 5, నిజామాబాదు వార్త.కామ్:

ఆగష్టు 4వ తేదీన ఆకస్మికంగా మరణించిన కోమనపల్లి ఉపాధ్యాయుడు ప్రభాకర్ కుటుంబానికి పీఆర్టీయూ అండగా నిలిచింది. శుక్రవారం సంఘం రాష్ట్ర అనుబంధ అధ్యక్షులు పెంట జలందర్, ప్రభాకర్ సతీమణి మంజూషాకు రూ.60వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాకర్ సేవలు మరవలేనివని, అతనిది పేద కుటుంబం కావడంతో ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారాం, పీఆర్టీయూ అర్బన్, రూరల్ అధ్యక్షులు గోపాల్, కిషన్ రెడ్డి, రురల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, జిల్లా కౌన్సిలర్లు శ్రీనివాస్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment