Thursday, 3 November 2016

ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష

నిజామాబాద్ వార్త.కామ్:

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 11వ తేదీ వరకు 48 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం నాయక్ తెలిపారు. గురువారం జల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండు చేసూ దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కనీసం ఈ దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలని, లేకపోతే నిరవధిక నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమన్నారు. అలాగే దీక్షకు యువజన విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నిబిల్, నాయ కులు కిరణ్, అంజలి, వెంకటేశ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment