Saturday, 5 November 2016

జిల్లాకు 25 మంది ఐఏఎస్ శిక్షణ అధికారుల రాక

నవంబర్ 6, నిజాంబాద్ వార్త.కామ్:
జిల్లాకు 25 మంది ఐఏఎస్ శిక్షణ అధికారులు రానున్నారు. వీరు ఈ నెల 1 నుంచి 13 వరకు జిల్లాలో ఉంటూ వివిధ ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేస్తారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి శిక్షణ అధికారులు వస్తుండడంతో వారు నివసించేందుకు ఎక్లాస్పూర్ క్యాంపులోని రంగదాస్చౌదరి ఇంట్లో నివాస వసతులను ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాలోని బోధన్, బీమ్గల్, సిరికొండ, మోరాడ్ కోటగిరి మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని కేటాయించారు. ఒక్కో గ్రామంలో ఐదుగురు అధికారులు వారం రోజులపాటు ఉంటూ గ్రామంలోని అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగపర్చుకుంటున్న తీరుపై అధ్యయనం చేస్తారు. ఆ గ్రామాన్ని మరింత అభి వృద్ధి పర్చేందుకు ఎలాంటి పథకాలు వర్తింపజేయాలన్న విషయాలను సైతం గుర్తిస్తారు.

No comments:

Post a Comment