Tuesday, 1 November 2016

గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు సెమినార్
  • నిజామాబాద్ వార్త: డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రస్తాయి గణితశాస్త్ర సెమినార్ను ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ లోని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్ తెలిపారు. ఆసక్తిగల గణిత శాస్త ఉపాధ్యాయులు, విద్యాశిక్షణా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకు లు ఇన్నోవేషన్ ఇన్ మ్యాథమెటిక్ ఎడ్యుకేషన్ అనే అంశంపై తమ సెమినార్ పేపర్లను నవంబర్ 80లోగా ఎస్సీఈఆర్ హైదరాబాద్కు పంపాలని తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైట్ లో లేదా జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ను సంప్రదించాలన్నారు.

రైతులు లాభపడేలా ముమ్మర చర్యలు

కలెక్టర్ యోగితారాణా
నిజామాబాద్ వార్త: రైతులు పండించే పంట అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతు లాభపడేలా చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ యోగితారాణా తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్ మార్కెటింగ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, రైతులు, లారీ యాజమాన్యాలు, ఆర్డీవోలతో ఆమె ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర, అమ్మకాలు, కొనుగోలు విషయంలో కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా చూడాలని తెలిపారు. రైతులు పండించిన నాణ్యమైన పంటకు సరైన ధర నిర్ణయించి రైతులు నేరుగా అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గన్నిబ్యాగులు, transport లేని వారికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ద్వారా అతితక్కువ ధరకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 
రైతులు నేరుగా లాభపడటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటికే ఆన్లైన్ లో అమ్మకాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆన్లైన్ చేయబడుతుందని, రవాణా విషయంలో రైతుల సూచనలు తీసుకొని నిర్ణీత ధర నిర్ణయించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమశాతం తెలిపే యంత్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని, మార్కెట్లోకి వచ్చే ధాన్యాన్ని గ్రేడింగ్ మార్కెటింగ్ వ్యవస్థను మార్కెటింగ్ శాఖ వారు చూసుకోవాలని తెలిపారు. ఈ స మావేశంలో సంయుక్త కలెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కమీషన్ ఏజెంటు సమయాన్ని బట్టి రైతుల దగ్గర ఎక్కువ శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు, వా టి నివారణకు రైతుల నాణ్య మైన పంటకు మంచి ధర కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ యన తెలిపారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుం డా వారి పంటలను ఈ జిల్లాలోనే అమ్మకునేలా సరైన ధర ఇప్పిస్తూ రైతులకు ఎక్కువ లాభం చేకూర్చేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు యాదిరెడ్డి, సుదాకర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ రియాజ్, ఆడిట్ అధికారి రమ, డీఎస్వో కృష్ణప్రసాద్, సివిల్ సప్లై మార్కెటింగ్ శాఖ, లారీ యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment