Tuesday, 15 November 2016

చోరీ కేసులో ముగ్గరు దొంగల రిమాండు



    నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్ : 

    నిజామాబాద్‌ నగరంలోని గాయత్రీనగర్‌లో గల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకి తరలిచినట్లు నాలుగో ఠాణా ఎస్సై మధు వెల్లడించారు. మంగళవారం నాలుగో ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాయత్రీనగర్‌లోని రవి అనే యజమాని కొద్దిరోజుల కిందట ఇంటకి తాళం వేసి వెళ్లగా.. అర్థరాత్రి సమయంలో చోరీ జరిగిందన్నారు. మొత్తం 3 తులాల బంగారు నగలతో పాటు ఒక చరవాణి చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టగా దొంగతనానికి పాల్పడింది మాక్లూర్‌కు చెందిన నాగరాజు, కోటగల్లికి చెందిన సురేష్‌, ఆంధ్రనగర్‌కు చెందిన గణేష్‌గా గుర్తించామన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారన్నారు. వారి నుంచి బంగారు నగలతో పాటు చరవాణి రికవరీ చేసి రిమాండుకి తరలించామన్నారు. ఈ సమావేశంలో సిబ్బంది రాజ్‌కుమార్‌, సాబేర్‌, మోహన్‌రెడ్డి, గౌరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

    No comments:

    Post a Comment