Wednesday, 2 November 2016

పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ 15
  • జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్

నిజామాబాదు వార్త: మార్చి 2017లో నిర్వహించే పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఈ నెల 15లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యారులు రూ.125, మూడు సబ్జెక్టుల కంటే తక్కువ సబ్జెక్టులు రాసే వారు రూ.110. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే వారు రూ.125, వోకే షనల్ విద్యారులు రూ.185 చెల్లించాలని తెలిపారు. ఈ నెల 15లోగా చెల్లించిన ఫీజులను ప్రధానోపాధ్యాయులు ఈ నెల 16న ట్రెజరీకి 17వ తేదీలోగా ఎన్ఆర్ కాపీని డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 28 లోగా చెల్లించవచ్చని, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 1లోగా, రూ.500 అప రాధ రుసుముతో డిసెంబర్ 8లోగా చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2017మార్చిలో మొదటిసారి పదోతరగతి పరీక్ష రాస్తున్న ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యారుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.20 వేలు మించని వారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొ న్నారు. విద్యారులు తహసీల్లార్ నుంచి పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం అందజే యాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పీజు కన్నా అధి కంగా వసూలు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. పదో తరగతి విద్యారుల వివరాలను ఆన్లైన్ నందు సమర్పించి ఆన్లైన్ కాపీలను, నామినల్ రోల్లను, మూల్యాంకణం కోసం ఉపాధ్యాయుల వివరాలను జిల్లా శాఖ వెబ్ సైట్లో పొందుపర్చాలని ఆయన కోరారు. పొందుపర్చిన నకల్ కాపీని, పదో తరగతి నామినల్ రోల్స్తో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

No comments:

Post a Comment