Monday, 21 November 2016

మార్చి 14 నుంచి టెన్స్ పరీక్షలు

మార్చి 14 నుంచి
టెన్త్ పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల విభాగం

నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్:

పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చి 14 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ సోమ వారం షెడ్యూల్ జారీ చేసింది. మార్చి14 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఉదయం 9:30కు ప్రారంభం కానున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం ఇన్చార్షి డైరెక్టర్ విశేషుకుమారి ప్రక టించారు. ఈ షెడ్యూల్ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందన్నారు. నిరుడు మార్చి21 నుంచి నిర్వహించగా ఈసారి వారం ముందే ప్రారంభం కానున్నాయి. 

చివరి అరగంటలోనే ఆబ్జెక్టివ్ పేపర్

ఆబ్జెక్టివ్ ప్రశ్నా పత్రానికి చివరి అరగంటలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుందని, ప్రశ్నాపత్రం కూడా చివరి ఆరగంటలోనే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఒక పరీక్షా కేంద్రానికి బదులు మరో పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాలు వేల్యూవేషన్ చేయబడవు. ఈసారి ఇంటర్ పరీక్షలతో పాటే పదో తరగతి పరీక్షలు నిర్వహించి ఫలితాలు త్వరగా వెల్లడించి మే లోనే టెన్త్ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని తొలుత భావించారు. దీంతో టెన్త్ పాస్ విద్యార్ధులకు ఇంటర్మీడియట్లో ప్రవేశం సులభమవుతుందని విద్యాశాఖ భావించింది. అయితే రెండు ఒకేసారి నిర్వహిస్తే పరీక్షా కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతాయని గుర్తించిన అధికారులు టెన్త్, ఇంటర్ పరీక్షలకు వేరువేరుగానే షెడ్యూల్ జారీ చేశారు.



No comments:

Post a Comment