Thursday, 3 November 2016

14న గోదావరి మహా హారతి

నిజామాబాద్ వార్త.కామ్:

పవిత్ర గోదావరి నదికి ఈ నెల 14న కార్తీక పౌర్ణమి(సోమవారం) జిల్లాలోని 11 పుష్కరమాట్ల వద్ద సాయంత్రం శ్ గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ వీరగోపాల్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉత్సవ సమితి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమ రూపకల్పనపై ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ మాట్లాడారు. ఆయా ఘాట్లకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీలు, సర్పంచులు, వీడీసీలు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా కన్వీనర్ కోటపాటి నర్సింహనా యుడు మాట్లాడుతూ.. మాట్ల వద్ద స్వాములు, వేదపండితులు, పూజారులు మార్గదర్శనం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బాసరఫూట్ల ఇన్ చార్జి మూడ నాగభూషణంగుప్తా, కోకన్వీనర్లు మనోహర్రెడ్డి, ఇందల్వాయి కిషన్, సర్పంచులు శంకర్, గంగాధర్ నరహరి, జగన్మోహన్గౌడ్, దేవాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment