Monday, 21 November 2016

ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి

ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి

ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జనవరి 28న ఎథిక్స్ పరీక్ష. షెడ్యూల్ విడుదల

నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు 2017 మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోరు కార్యదర్శి ఎ.ఆశోక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబందించిన షెడ్యూల్నుఆయన ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎథిక్స్ పరీక్ష జనవరి 28న, పర్యావరణ సబ్జెక్టు పరీక్ష జనవరి 31న నిర్వహిస్తారు. ఈ రెండు సబ్జెక్టుల రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రాక్టీకల్స్ ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ఉంటాయి. ఈ పరీక్షల షెడ్యూలు, ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు వర్తిస్తుందని బోరు ఓ ప్రకటనలో పేర్కొంది.



No comments:

Post a Comment