Saturday, 5 November 2016

1న ముదిరాజ్ సింహగర్జన సభ

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
వచ్చే నెల 1వ తేదీన ముదిరాజ్ సింహ గర్ధన సభ నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ్ల ప్రకాష్ తెలిపారు. నగరంలోని ఖలీల్ వాడిలో గల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి గోపి అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. తరువాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీన ధర్పల్లి మండలం గౌరారం గ్రామ చౌరస్తా వద్ద అమరుడు పోలీస్ కిష్టియ్య విగ్రహ ప్రతిష్ణాపన, తరువాత సింహగర్జన సభ జరుగుతుందని వివరించారు. సభకు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు భూపతి, విఠల్ ఈర్ల శేఖర్ ఇతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment