Saturday, 5 November 2016

రైతులకు వెన్నుదన్ను

  • డిసెంబర్ 1 నుంచి నీటి విడుదల
  • నీటి పారుదల సలహా బోర్డు సమావేశంలో నిర్ణయం

నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్: 
రైతాంగానికి సాగునీరు అందించేందుకు అధికార యంత్రాగం ముంద డుగు వేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో జలాశయాలు నిండాయి. ఇలాంటి సమయంలో రైతులకు నీటి లభ్యత లేకుండా పోయింది. నీటి పారుదల సలహా బోర్డు సమావేశం పెట్టి నిర్ణయించాల్సిన అధికారులు తీవ్ర జాప్యం చేశారు. ఈ విషయాన్ని 'ఈనాడు' లో ఈ నెల 1వ తేదీన 'నారు. నీరు. తేల్చరు కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు అధికారులు దీనికి స్పందించారు. నీటి పారుదల బోర్డు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లాపరిషత్ సమావే మందిరంలో రెండు జిల్లాలకు కలిపి బోర్డు సమావేశం జిల్లా పాలనాధికారిణి యోగితా రాణా అధ్య క్షతన జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజర య్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి పంటల కోసం జలశయాల నుంచి నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ మిగులు నీళ్లను లక్ష్మీ కాలువ, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకోని అక్కడి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రెండు జిల్లాలో రైతుల పంటల కోసం జలాశయాల నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి విడతల వారీగా నీటిని విడుదల చేస్తు న్నామని చెప్పారు. ఇప్పుడు ఉన్న పంటలు నవంబర్ 25వ తేదీ వరకు కోతలు కోసే విధంగా వ్యవ సాయ అధికారులు చూడాలన్నారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధంగా ఉండే విధంగా కావల్సిన ఏర్పాటు చేయాలని చెప్పారు. రబీ సీజన్ పంటలను మార్చి 81వ తేదీ లోపు పంటలు చేతికి వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మార్చి 81వ తేదీ తరువాత ఎలాంటి పంటలు ఉండవద్దన్నారు. పాలనాధికారిణి యోగితా రాణా మాట్లాడుతూ. నీటి పారుదల సలహా బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు ప్రతి రైతులకు నీరు అందే విధంగా చూస్తామన్నారు. ప్రతి రోజు దీనికి సంబంధించిన నివేదికను తనకు అందివ్వాలని అధికారులను ఆదే శించారు. ఎమ్మెల్యే హన్మంత్షిండె మాట్లాడుతూ. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నవంబర్ 25 లోపు రైతులు పంటలు కోసే విధంగా చూడాలన్నారు. ఎమ్మెలీ వీజీ గౌడ్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సంయుక్త కలెక్టర్లు రవీందర్ రెడ్డి, సత్తయ్య నీటి పారు దల శాఖ ఎస్ఈ గంగాధర్ పాల్గొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్టీవోలు, తహసీల్గార్లు సమావేశానికి హాజరయ్యారు.

No comments:

Post a Comment