Wednesday, 30 November 2016

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ

డిసెంబర్ 1,  నిజామాబాదు వార్త.కామ్:

మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం కమిషనరేట్‌ అంతటా ఆరు షీ టీంలను ఏర్పాటు చేసినట్లు సీపీ కార్తికేయ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎవరైనా మహిళలు, విద్యార్థినులు, యువతులను వేధించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీంలను ప్రారంభించిన పక్షం రోజుల్లోనే 8 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 30 కేసుల్లో..41 మందిని పట్టుకోవటం జరిగిందన్నారు. మరో 35 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు కళాశాలల వద్ద షీ టీంలు తిరుగుతున్నాయన్నారు. రహస్య కెమెరాల ద్వారా రికార్డు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తామని సీపీ హెచ్చరించారు.
అనుమానాస్పదంగా కవలలు మృతి 

డిసెంబర్ 1, నిజామాబాదు వార్త.కామ్:


అభంశుభం తెలియని చిన్నారి కవలలు వారు. ముద్దులొలికే చిన్నారులు. సైగలు.. ముసి ముసి నవ్వులతో కుటుంబ సభ్యులను సంతోషపెట్టేవారు.. కల్మషం లేని మనసులు.. బుడిబుడినడకలు వేసే చిన్నారులను విధి వెక్కిరించింది. చిట్టి పొట్టి మాటలు, ఆడుకున్న బాసలు మరిచి, నిద్రలోకి జారుకున్న రెండు గంటల్లోపే వారు కానరాని లోకాలకు వెళ్లారు. జన్మించిన 14 నెలలోపే వారిని మృత్యువు చేరదీసుకుంది. ఈ కవలల మృతి మిస్టరీగా మారింది.

బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఎస్సీ వాడలో కవల పిల్లలు ఇద్దరు బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ గ్రామానికి చెందిన చీకట్ల జైనిత్‌, జైనిష్‌ 14 నెలల చిన్నారులు. చీకట్ల యాదగిరి- కల్పనల దంపతుల పిల్లలు. ఎప్పటి మాదిరిగానే తల్లి తన కవలలకు పాలు, బిస్కెట్‌ తినిపించింది. ఆ తర్వాత పడుకోబెట్టింది. నిద్రలోకి జారుకున్న వారిని రెండు గంటల తరువాత తట్టిలేపినా కదలలేదు. తల్లి ఏడుపులంకిస్తూ కాలనీ వాసులను, కుంటుంబీకులను పిలిచింది. పడుకున్న వారు పడుకున్నట్లే పోవడంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. రెండు గంటల క్రితం అల్లారు ముద్దుగా ఆడుకున్న వారు మృత్యువు ఒడిలోకి చేరుకోవటాన్ని చూసి అందరూ విషాదంలో మునిగిపోయారు.

విషాహారంతోనే చనిపోయారా....?

రెండు గంటల ముందు చురుకుగా ఆడుకోగా, ఒకేసారి ఇద్దరూ మృతిచెందడంపై అనుమానాలు తలెత్తాయి. ఇందుకు విషాహారమే కారణం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో విచారణ చేపట్టాల్సి ఉంది. పిల్లల తండ్రి యాదగిరి ఏడాది కాలంగా పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి కల్పన, నానమ్మలు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ కుటుంబానికి శత్రువులెవరైనా ఉన్నారా? కుటుంబంలో ఏదైనా తగదాలు ఉన్నాయా? ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడిన డీఎస్పీ

కామారెడ్డి డీఎస్పీ భాస్కర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడారు. మంత్రాల నెపంతో తమ పిల్లలు చనిపోయారని ఆరోపిస్తూ డీఎస్పీకి బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవ పరీక్ష నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వెంట భిక్కనూరు సీఐ శ్రీధర్‌కుమార్‌, ఎస్సైలు రవిబాబు, నరేందర్‌ ఉన్నారు.

చందూర్‌ రోడ్డు ప్రమాద ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

డిసెంబర్ 1,  నిజామాబాదు వార్త.కామ్:

వర్ని మండలం చందూర్‌ గ్రామంలో ఈ నెల 27న ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ నగరానికి చెందిన బసవపూర్ణ(52) అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. చందూర్‌లోని తన బంధువుల ఇంటి నుంచి తిరిగి నిజామాబాద్‌లోని మహాలక్ష్మినగర్‌లో గల తన ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డు పక్కన నిలబడగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై తొలుత గుర్తు తెలియని వాహనం అతివేగం, అజాగ్రత్తగా నడిపి ఢీకొట్టి వెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్థానికులు గుర్తించి గాంధీనగర్‌ తండా సమీపంలో పట్టుకొన్నట్లు తెలిసింది. తదనంతరం వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఎవరని ఆరా తీస్తున్నారు. వాహనం నడిపిందా డ్రైవరా? లేక యజమానా అన్నది తేలాల్సి ఉంది. అతి త్వరలోనే కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని వర్ని ఎస్సై అంజయ్య తెలిపారు.

Monday, 21 November 2016

మార్చి 14 నుంచి టెన్స్ పరీక్షలు

మార్చి 14 నుంచి
టెన్త్ పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల విభాగం

నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్:

పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చి 14 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ సోమ వారం షెడ్యూల్ జారీ చేసింది. మార్చి14 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఉదయం 9:30కు ప్రారంభం కానున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం ఇన్చార్షి డైరెక్టర్ విశేషుకుమారి ప్రక టించారు. ఈ షెడ్యూల్ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందన్నారు. నిరుడు మార్చి21 నుంచి నిర్వహించగా ఈసారి వారం ముందే ప్రారంభం కానున్నాయి. 

చివరి అరగంటలోనే ఆబ్జెక్టివ్ పేపర్

ఆబ్జెక్టివ్ ప్రశ్నా పత్రానికి చివరి అరగంటలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుందని, ప్రశ్నాపత్రం కూడా చివరి ఆరగంటలోనే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఒక పరీక్షా కేంద్రానికి బదులు మరో పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాలు వేల్యూవేషన్ చేయబడవు. ఈసారి ఇంటర్ పరీక్షలతో పాటే పదో తరగతి పరీక్షలు నిర్వహించి ఫలితాలు త్వరగా వెల్లడించి మే లోనే టెన్త్ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని తొలుత భావించారు. దీంతో టెన్త్ పాస్ విద్యార్ధులకు ఇంటర్మీడియట్లో ప్రవేశం సులభమవుతుందని విద్యాశాఖ భావించింది. అయితే రెండు ఒకేసారి నిర్వహిస్తే పరీక్షా కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతాయని గుర్తించిన అధికారులు టెన్త్, ఇంటర్ పరీక్షలకు వేరువేరుగానే షెడ్యూల్ జారీ చేశారు.ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి

ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి

ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జనవరి 28న ఎథిక్స్ పరీక్ష. షెడ్యూల్ విడుదల

నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు 2017 మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోరు కార్యదర్శి ఎ.ఆశోక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబందించిన షెడ్యూల్నుఆయన ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎథిక్స్ పరీక్ష జనవరి 28న, పర్యావరణ సబ్జెక్టు పరీక్ష జనవరి 31న నిర్వహిస్తారు. ఈ రెండు సబ్జెక్టుల రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రాక్టీకల్స్ ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ఉంటాయి. ఈ పరీక్షల షెడ్యూలు, ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు వర్తిస్తుందని బోరు ఓ ప్రకటనలో పేర్కొంది.అనారోగ్యంతో విద్యార్థిని మృతి

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్:

అంకోల్‌(నస్రుల్లాబాద్‌): నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న గాయత్రి సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంకోల్‌ గ్రామానికి చెందిన సాయిలు, మైశవ్వల కూతురు గాయత్రి(11) బిచ్కుందలోని ఓ పాఠశాలలో విద్యనభ్యసిస్తుండగా అనారోగ్యానికి గురయ్యింది. వివిధ ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. బిచ్కుంద మండలం సిర్‌సముందర్‌ గ్రామంలోని తన అక్క ఇంట్లో సాయిలు తన కూతురును ఉంచారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందారన్నారు. అంకోల్‌ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థిని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజిత, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్‌ బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అండగా ఉంటానని వెళ్లి... అనంత లోకాలకు...  అండగా ఉంటానని వెళ్లి... అనంత లోకాలకు...
  దుబాయ్‌లో రుద్రూర్‌ వాసి మృతి 

  నవంబర్ 22, నిజామాబాదు వార్త.కామ్: కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని... ధైర్యం చెప్పి దేశం కాని దేశం వెళ్లి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వృద్ధులైన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, ముగ్గురు పిల్లల పోషణ కోసం ఆర్నెల్ల క్రితం పొట్ట చేతపట్టుకుని అప్పులు చేసి దుబాయ్‌ వెళ్లిన యువకుడు నాలుగు రోజుల క్రితం దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన వీరయ్య, లక్ష్మమ్మల కుమారుడు నగేష్‌ (35) ఆర్థిక పరిస్థితుల మూలంగా దుబాయ్‌ వెళ్లాడు. రెక్కాడితేనే కాని డొక్కాడని కుటుంబం. ఇంట్లో కట్టుకున్న భార్యతో సహా తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే కుటుంబం గడవాల్సిన పరిస్థితి. శివకుమార్‌(12), శ్రావణి(8), వినోద్‌(3) సంతానం. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో సరైన పనులు ఇక్కడ లేకపోవడంతో దుబాయ్‌ వెళ్లి వస్తానని ఇంట్లో నచ్చచెప్పారు. గతంలో ఒక సంవత్సరం దుబాయ్‌లో ఉండి వచ్చిన నగేష్‌ ఆర్నెల్ల క్రితం ఎన్నో ఆశలతో మళ్లీ వెళ్లారు. అక్కడ పనులు చేసుకుంటూ రోజూ ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆర్థికంగా ఎదిగి... కుటుంబాన్ని మంచిస్థాయికి తీసుకొస్తానని... నాకోసం ఆందోళన చెందవద్దని నిత్యం నగేష్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేవాడు. రోజూలాగే మూడు రోజుల క్రితం ఫోను రావడంతో నగేష్‌ చేశాడనుకుని సంబరపడిన కుటుంబ సభ్యులకు మృత్యువార్త తెలిసింది. విషయాన్ని వృద్ధులైన తల్లిదండ్రులకు తెలిస్తే వారు ఏమైపోతారోనన్న ఆందోళనతో తెలియనివ్వలేదు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం విషయంలో ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఒక్క ఇల్లు తప్ప ఏమీలేని బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు కోరుతున్నారు.

  Sunday, 20 November 2016

  అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..!   అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..!

   నవంబర్ 21, నిజామాబాదు వార్త.కామ్:

   మండలం లోని సికింద్రాపూర్‌ గ్రామ పరిధిలోని బాల్‌నగర్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో బాల్‌నగర్‌కు చెందిన కొమ్మరి నర్సవ్వ(48) మృతిచెందినట్లు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని నర్సవ్వ మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతోనే ఆమె మృతిచెందినట్లు చెబుతున్నారు. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలో ఇదీ నిక్షిప్తమైందని తెలిపారు. పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొందని చెబుతుండటం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

   Thursday, 17 November 2016

   రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

   నవంబర్ 17, నిజామాబాదు వార్త.కామ్:

   దోమకొండ శివారులో బుధవారం ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. రామారెడ్డికి చెందిన తోట భూమెల్ల తిరుపతి, బండి బాల్‌రాజులు దోమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పని నిమిత్తం వస్తుండగా, ఎదురుగా వెళ్తున్న దోమకొండ వాసి షేక్‌ షాకీర్‌ తన ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడిపించుకుంటూ వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తిరుపతి, బాల్‌రాజులకు గాయాలయ్యాయి. బాధితుల పిర్యాదు మేరకు ప్రమాదానికి కారకుడైన షేక్‌ షాకీర్‌పై కేసు నమోదు చేశానని ఎస్సై నరేందర్‌ తెలిపారు.
   బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

   నవంబర్ 17, నిజామాబాదు వార్త.కామ్:

    మండలం కలిగోట్‌ గ్రామంలోని పుట్ట శివాలయం వద్ద బావిలో దూకి బుధవారం చింతలూర్‌ గ్రామానికి చెందిన అమ్ముల కృష్ణబాయి(80) అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె ఆస్పపత్రిలో చూపించాలని కుటుంబసభ్యులను బుధవారం కోరింది. ఆర్మూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరువాత తీసుకెళతామని చెప్పారు. కాసేపటికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కృష్ణబాయి బావిలో దూకిందన్నారు. కుటుంబసభ్యులు గాలించగా బావిలో శవమై కనిపించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

   మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

   నవంబర్ 17, నిజామాబాదు వార్త.కామ్:

   కామారెడ్డి పట్టణం కిష్టమ్మ గుడి ప్రాంతంలో నివాసం ఉండే ముదాం లలిత అనే మహిళ మెడలో నుంచి బుధవారం ఉదయం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకొని పారిపోయాడు. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం.. లలిత ఉదయం 6 గంటల ప్రాంతంలో కుళాయి నీటి కోసం పైపు బిగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడను పట్టుకొని గొలుసు తెంపుకొని గుంతలోకి నెట్టి పారిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో కంగారు పడిన మహిళ తేరుకొని అరిచే లోపే అక్కడి నుంచి వ్యక్తులు పరారయ్యారు. చుట్టు పక్కల వాళ్లు గాలించినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. బాధిత కుటుంబం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై శోభన్‌బాబు సందర్శించారు. ఘటనకు సమీపంలోనే పోలీస్‌ సబ్‌కంట్రోల్‌ రూం ఉంది. గత కొంత కాలంగా పట్టణంలో స్తబ్దుగా ఉన్న గొలుసు చోరీల అపహరణ మళ్లీ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

   కలెక్టరేట్‌ ఎదుట ప్రైవేటు వైద్యుల ధర్నా   నవంబర్ 17, నిజామాబాదు వార్త.కామ్:

    ప్రైవేటు వైద్యుల సమస్యలు పరిష్కరించి.. కఠితరమైన నిబంధనలను సడలింపు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ సూరి మాట్లాడుతూ.. యునాని, ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు ఆరు నెలలు శిక్షణ ఇచ్చి వారితో అలోపతి మందులు రాయించి రోగులకు వైద్యం చేసే ఏర్పాట్లు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఐదు సంవత్సరాల పాటు వైద్య వృత్తి చదివిన వారిని పక్కన పెట్టి ఆయూష్‌ వైద్యులకు ఆరు నెలల శిక్షణతో అలోపతి మందులు రాయించడం నిబంధనలకు విరుద్దమన్నారు. నిబంధనల ప్రకారం వైద్యులకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వ అధికారులతో నియమించబడిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టానికి తగిన సవరణలు తీసుకొచ్చి అవినీతిరహితంగా ప్రభావ వంతంగా తీర్చిదిద్దాలని కోరారు. స్కానింగ్‌ చేసిన వారి పేరు రిజిష్టర్‌లో నమోదు చేయకపోయినా, సిబ్బంది వల్ల చిన్నపాటి తప్పులు దొర్లినా రేడియాలజిస్టులదే బాధ్యత అని చెప్పే చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. వైద్యులపై దాడులను, దౌర్జన్యాలను అరికట్టేందుకు కేంద్ర చట్టాన్ని తీసుకొనిరావాలని ఐఎంఏ డిమాండు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సత్యాగ్రహం కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు అనీల్‌కుమార్‌, ఉష, మల్లీశ్వరి, వినోద్‌కుమార్‌ గుప్తా, శ్రీనివాస్‌, లక్ష్మారెడ్డి, వసంత్‌రావు, కిషన్‌, కవితారెడ్డి, రవీందర్‌ రెడ్డి, హరీష్‌స్వామి, విశాల్‌, హరికృష్ణ, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

   ఆస్పత్రులు మూసివేత

   వైద్యుల ధర్నా కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లావ్యాప్తంగా ఆస్పత్రులు మూసిశారు. అన్ని ఆస్పత్రుల్లో ఓపీ పూర్తిగా మూసివేసి అత్యవసర పరిస్థితి ఉంటేనే వైద్యులు రోగులను చేర్చుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రులు వెలవెలబోయాయి. 24 గంటలు రద్దీగా ఉండే ఖలీల్‌వాడి రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

   నలుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి

   ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ

   నవంబర్ 17, నిజామాబాద్‌ వార్త.కామ్: 
   జిల్లాలో నలుగురు ఎస్సైలకు సీఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఎస్సైలు బోసుకిరణ్‌, సైదయ్య, ప్రతాప్‌లింగం, ముజిబూర్‌రెహ్మన్‌లు ఉన్నారు. బోసుకిరణ్‌, సైదయ్య సైబరాబాద్‌ కమిషనరేట్‌, ప్రతాప్‌లింగం ఎస్‌బీ నల్గొండ, ముజిబూర్‌రెహ్మన్‌ డీటీసీ వికారాబాద్‌కు పోస్టింగు ఇచ్చారు. అయితే నిజామాబాద్‌ సీపీ కార్తికేయ తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం వీరు ఇక్కడి నుంచి రిలీవ్‌ కానున్నారు. ప్రస్తుతం బోసుకిరణ్  రెండో ఠాణా, సైదయ్య ఐదో ఠాణా ఎస్సైలుగా కొనసాగుతుండగా.. ముజిబూర్‌ రెహ్మన్‌, ప్రతాప్‌లింగం వీఆర్‌లో ఉన్నారు.

   Tuesday, 15 November 2016    నోట్లు.. ప్రజల పాట్లు..


    నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్ :

     నల్లధనం అరికట్టాలని పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆచరణలోకి వచ్చి సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర అయోమయానికి గురిచేయడంతో పాటు ఇబ్బందుల పాలు చేస్తోంది. పాత నోట్లు రద్దయి మంగళవారం నాటికి వారం రోజులైనప్పటికీ కొత్తనోట్లు పూర్తిస్థాయిలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయాయి. వారం రోజులుగా ఇంట్లో ఉన్న చిల్లర డబ్బులు పొదుపుగా ఖర్చుచేసి అత్యవసరమైన నిత్యావసర సరకులు కొనుగోలు చేస్తూ వారం పాటు నెట్టుకొచ్చారు. గురునానక్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం బ్యాంకులు మూసి ఉన్నాయి. ఏటీఎంలు కూడా బంద్‌ ఉన్నాయి. దీంతో మంగళవారం రద్దీ మరింత పెరిగింది. ఉదయం బ్యాంకుల తాళాలు తీయడానికి ముందునుంచే జనాలు బ్యాంకుల ముందు బారులుతీరి రోడ్లపై నిలబడ్డారు. పలు బ్యాంకులు తమ బ్యాంకుల ముందు షామియానాలు వేసి నీడను కల్పించాయి. ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, మామిడిపల్లి, అంకాపూర్‌, ఆలూర్‌, పిప్రి, మంథని, దేగాం, గోవింద్‌పేట్‌తో పాటు పలు గ్రామాల్లోని ఏఈటీఎంలు పనిచేయలేదు. మామిడిపల్లిలో విజయ బ్యాంకు ఏటీఎం ఒక్కటే పనిచేసింది. దీంతో అందరు ఇక్కడికే చేరడంతో బ్యాంకు నిర్వాహకులు గార్డును నియమించి ఒక్కొక్కరు కేవలం రూ. 1000 మాత్రమే తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. పాత నోట్లు మార్చుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి అందరు బ్యాంకులకు వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం బ్యాంకులో వరుస క్రమంలో నిలబడేందుకు ఇబ్బందులకు గురయ్యారు. పనులు మానుకొని నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయడం ప్రజలకు దినవారీ చర్యగా మారిపోయింది. ఇంతచేసి బ్యాంకులో రోజుకు రూ. 4000 వేలు మార్పిడి చేసుకుంటే రూ. 2000 వేల నోట్లు రెండు ఇస్తున్నారు. ఈ నోట్లు తీసుకుని నిత్యావసరాలు కొనుగోలు చేద్దామని వెళితే బయట ఎవరూ చిల్లర డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నోట్లు మార్పిడి చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని రూ. 100, రూ. 50 నోట్లతోపాటు రూ. 500 నోట్లు ఎక్కువగా విడుదల చేస్తేగాని ఇబ్బందులు తొలగిపోవని పేర్కొంటున్నారు.


     నేటి నుంచి డిజిటల్‌ తరగతులు

     16 నుంచి 19వ తేదీ వరకు
     తరగతుల సమయం ఖరారు
     జిల్లాలో 141 పాఠశాలల్లో అమలు

     నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

     ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతికపరంగా, టీవీ ద్వారా పాఠ్యాంశాలను బోధించేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. డిజిటల్‌ తరగతుల పేరుతో మన టీవీ ఛానెల్‌ ద్వారా ప్రతీ రోజు సబ్జెక్టుల వారిగా బోధనలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు శిక్షణ కూడా అందజేశారు. విద్యార్థులకు టీవీ ద్వారా బోధించే పాఠాలను, తిరిగి ఉపాధ్యాయుడు వివరించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు జిల్లాలోను ప్రొజెక్టర్‌, ఆర్‌వోటీ, కేబుల్‌ తదితర పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న పాఠశాలలను సిద్ధంగా ఉంచారు. ఈ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 141 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ కూడా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు డిజిటల్‌ తరగతుల సమయాన్ని బోధించే సబ్జెక్టులను ఖరారు చేసింది. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశ బోధన జరగనుంది.


      పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పెద్దపీట

      పతంజలి పరిశ్రమ ఏర్పాటైతే రైతులకు మేలు ఎంపీ కవిత


      నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

      పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పసుపు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని గ్రహించి జిల్లాలో పసుపు పరిశ్రమల ఏర్పాటుకు పతంజలి గ్రూపు అధినేత రాందేవ్‌ బాబాను తాను కలిసినట్లు చెప్పారు. జిల్లాలో పరిస్థితులను పరిశీలించేందుకు ఆ గ్రూపు సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కంపెనీల ఏర్పాటు ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితం అయ్యేవని, కానీ తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మన రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే రకరకల పాలసీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారని తెలిపారు. భారతదేశంలోనే మన రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి మొదటి స్థానంలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులకు మేలు చేసేలా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ..రైతుల ప్రయోజనం కోసం పతంజలి యూనిట్లను నెలకొల్పుతామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమను నెలకొల్పడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మన వద్ద ఉన్న వనరుల ద్వారానే పరిశ్రమ ఏర్పాటు చేయాలనేది తమ సంస్థ ఉద్దేశం అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే పరిశ్రమల ఏర్పాటుకు తాము ముందుకు వస్తున్నామని..వ్యాపార పరంగా కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. పసుపు వంటకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, ఇది ఔషధంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, అధికారులు పాల్గొన్నారు.       పోలీసు వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

       నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

       నగరంలోని కంఠేశ్వర్‌ మీ-సేవా కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం ఓ వృద్ధుడిని పోలీసు వాహనం ఢీకొంది. ఈ ఘటనలో సదరు వృద్ధుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడు కంఠేశ్వర్‌కు చెందిన అనంత్‌రావ్‌(69)గా పోలీసులు గుర్తించారు. అనంత్‌రావ్‌ అనే వృద్ధుడు ఆక్టివా వాహంనపై మీ-సేవా రోడ్డు వైపు మలుపుతుండగా వెనుకాల ఉన్న రెండో ఠాణా ఎస్సై వాహనం ఢీకొంది. దీంతో అనంత్‌రావుకు తీవ్ర గాయాలవ్వగా 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీరా రాత్రి 7 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఠాణా వాహనం డ్రైవరు ఏఆర్‌ పీసీ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు మూడో ఠాణా ఎస్సై శ్రీహరి వెల్లడించారు. ఇటు ప్రమాద సమయంలో ఠాణా వాహనం డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి ఏఆర్‌ పీసీ కావటంతో ఇతనిపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు.
       చోరీ కేసులో ముగ్గరు దొంగల రిమాండు        నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్ : 

        నిజామాబాద్‌ నగరంలోని గాయత్రీనగర్‌లో గల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకి తరలిచినట్లు నాలుగో ఠాణా ఎస్సై మధు వెల్లడించారు. మంగళవారం నాలుగో ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాయత్రీనగర్‌లోని రవి అనే యజమాని కొద్దిరోజుల కిందట ఇంటకి తాళం వేసి వెళ్లగా.. అర్థరాత్రి సమయంలో చోరీ జరిగిందన్నారు. మొత్తం 3 తులాల బంగారు నగలతో పాటు ఒక చరవాణి చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టగా దొంగతనానికి పాల్పడింది మాక్లూర్‌కు చెందిన నాగరాజు, కోటగల్లికి చెందిన సురేష్‌, ఆంధ్రనగర్‌కు చెందిన గణేష్‌గా గుర్తించామన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారన్నారు. వారి నుంచి బంగారు నగలతో పాటు చరవాణి రికవరీ చేసి రిమాండుకి తరలించామన్నారు. ఈ సమావేశంలో సిబ్బంది రాజ్‌కుమార్‌, సాబేర్‌, మోహన్‌రెడ్డి, గౌరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.         పర్యాటక రంగం అభివృద్ధికి కృషి  

         తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పేర్వారం రాములు

         నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

         ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పేర్వారం రాములు అన్నారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన మంగళవారం హరిత ఇందూర్‌ ఇన్‌ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర పాలనలో పర్యాటక కేంద్రాలున్నప్పటికి అప్పటి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం బయటి ప్రపంచానికి పర్యాటక అంశాలు తెలియజేయాలనే కొత్త కార్యచరణ రూపొందించిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటిస్తామన్నాఉ. ఆయా జిల్లాల్లో పర్యటించి అక్కడి చారిత్మక, ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల వివరాలు సేకరించి అభివృద్ధి విషయాలు తెలుసుకుంటామన్నారు. సోమశిల, నుంచి శ్రీశైలం వరకు కృష్ణ నదిపై బోట్‌ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోట్‌లో ప్రయాణం చేస్తు ప్రకృతిని ఆస్వాదించవచ్చన్నారు. రెండు రోజులుగా మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పర్యటన సాగిందని ఇందులో అలీసాగర్‌, పోచారం చెరువు పరిశీలించామన్నారు. అలీసాగర్‌లో పర్యాటక అభివృద్ధి పనులు రూ.3.5 కోట్లతో కొనసాగుతున్నాయన్నారు. మరిన్ని నిధులు సమకూర్చి పనులు పూర్తి చేయిస్తామన్నారు. పనులు పూర్తి కాగానే ప్రత్యేకంగా పర్యాటక బస్సులు హైదరాబాద్‌ నుంచి ప్రారంభిస్తామన్నారు. ఈ బస్సులు కొల్చరాం, ఏడుపాయలు, మెదక్‌ పోర్టు, అలీసాగర్‌లో రాత్రి బస చేసి ఉదయం నిజామాబాద్‌ ఁల్లా రామాలయం, డిచ్‌పల్లి రామాలయం, దోమకొండ కోటను తిలకించి హైదరాబాద్‌కు తీసుకెళ్తుందన్నారు. దీంతో తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.

         జడ్పీ సీఈఓ మోహన్ లాల్ కు పదోన్నతి

         -సీఈఓగానే కేటాయింపు

          నవంబర్ 16,  నిజామాబాదు వార్త.కామ్ 

          జిల్లాపరిషత్‌ సీఈఓ మోహన్‌లాల్‌కు పదోన్నతి లభించింది. రెవెన్యూ శాఖకు చెందిన ఆయన డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో సీఈఓగా పని చేస్తున్నారు. ఆయనకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదాను కల్పిస్తూ పదోన్నతి ఇచ్చారు. దీనికి సంబంధించి జీవో ఆర్‌టీ నెం. 664 ద్వారా ఉత్తర్వులు వచ్చాయి. పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మోహన్‌లాల్‌ను తిరిగి జడ్పీ సీఈవోగానే పోస్టింగ్‌ ఇచ్చింది.


          సిద్దులగుట్టపై పతంజలి సీఈవో, ఎంపీ, ఎమ్మెల్యే పూజలు

          నవంబర్ 16, నిజామాబాదు వార్త.కామ్:

          ఆర్మూర్‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై ఉన్న శివాలయంలో పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్‌ ప్రాంతంలో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పే విషయమై పరిశీలన జరపడానికి విచ్చేసిన పతంజలి సీఈవో బాలకృష్ణను ఎంపీ, ఎమ్మెల్యే సిద్దులగుట్ట సందర్శనకు తీసుకొచ్చారు. సిద్దులగుట్ట ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, కమిటీ ప్రతినిధులు బి.సుమన్‌, బోబిడే గంగాకిషన్‌, పీసీ గంగారెడ్డి, మీనా చందు తదితరులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరితో పాటు పురపాలక ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లూ, మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ యామాద్రి కవిత, న్యాయవాది ఖాందేష్‌ సంగీత, జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.సాందన్న, పురపాలక వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌, తదితరులు ఇరుకైన గుహలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి కుమారశర్మ వారిని పట్టుశాలువాలతో సత్కరించారు. నూతనంగా నియమితులైన ఆర్మూర్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకవర్గం పతంజలి సీఈవో బాలకృష్ణ, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలను పుష్పగుచ్ఛాలు, పట్టుశాలువాలతో ఘనంగా సన్మానించారు.

          బాల్కొండ ఎస్సై స్వామిగౌడ్‌ సస్పెన్షన్‌

          ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ
          తీవ్ర అవినీతి ఆరోపణలే కారణం


          బాల్కొండ ఎస్సై స్వామిగౌడ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన అధికారులు విధుల నుంచి తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. వూహించని రీతిలో వసూళ్లకు పాల్పడటం, లెక్కలేనన్ని ఫిర్యాదులు వెళ్లటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత ఇదే తొలి సస్పెన్షన్‌ కావటం విశేషం.

          జిల్లాలోని ఎస్సైల పనితీరుపై డీఐజీ అకున్‌ సబర్వాల్‌ మొదటి నుంచి పూర్తి అసంతృప్తితో ఉన్నారు. నేతల అందలంతో పోస్టింగులు దక్కించుకున్న కొందరు ఎస్సైలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు తోడు సివిల్‌ తగాదాల్లోను తలదూర్చి అసలు బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదుల రూపంలో వెళ్లింది. హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీగా అకున్‌ సబర్వాల్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పర్యటనకు వచ్చి తనదైన శైలిలో హితబోధ చేశారు. అయినా పలువురు తమ తీర్చు మార్చుకోకపోగా.. బదిలీలు చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన డీఐజీ ఆకస్మిక తనిఖీలు చేసి హెచ్చరించారు. బోధన్‌ సబ్‌ డివిజన్‌లో ఓ నలుగురు ఎస్సైలపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. వీరిపై చర్యలు ఉంటాయని అప్పట్లో షికార్లు పుకార్లు చేశాయి. ఇంతలోనే ఉన్నతాధికారులు మారటంతో డీఐజీ కూడా కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్నారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత తాజాగా భీమ్‌గల్‌, బాల్కొండ సర్కిల్‌ పరిధిల్లో డీఐజీ పర్యటించి తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించి వెళ్లారు.

          హెచ్చరించి వెళ్లిన డీఐజీ

          బాల్కొండ పర్యటనలో భాగంగా ఎస్సై స్వామిగౌడ్‌ను ఉద్దేశించి డీఐజీ సబర్వాల్‌ తీవ్రస్థాయిలో మందలించారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయేంత వసూళ్లకు పాల్పడ్డావంటు మండిపడ్డారు. కుటుంబ తగాదాలు, భూ దందాలతో పాటు రోడ్డు ప్రమాదాల్లో తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరించారని వివరాలతో సహా చెప్పారు. ఏ కేసులో ఎంతెంత తీసుకున్నావో లెక్కలు కూడా తెలుసునని చెప్పటంతో పాటు సస్పెన్షన్‌ చేస్తానని, భవిష్యత్తులో పూర్తిగా అకాడమికి పరిమితం అయ్యేలా చూస్తానని హెచ్చరించారు. అయితే తనకు నేతల అందలం ఉందని భావించిన ఎస్సై ఏమీ కాదని భావించాడు. ఇంతలోనే సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడటం మింగుడు పడటం లేదు.

          Wednesday, 9 November 2016           జాతీయ బాలల ఉత్సవాలకు జిల్లా విద్యార్థులు

           నవంబర్ 10, నిజామాబాదు వార్త.కామ్:
           జాతీయ బాలభవన్‌ కొత్తదిల్లీ సంచాలకుల ఆహ్వానం మేరకు ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే బాలల దినోత్సవాలకు జిల్లా బాలభవన్‌ విద్యార్థులు తరలివెళ్తున్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్‌ తన ఛాంబర్‌లో చిన్నారులు వివిధ అంశాల్లో ప్రతిభ గల అనిక, మహిమకీర్తి, లక్ష్మీనర్సింహ, పవన్‌ ఆదిత్యలను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సవాల్లో సత్తాచాటి జిల్లాకు పేరుతీసుకురావాలన్నారు.

           నేటి నుంచే అందుబాటులోకి కొత్త నోట్లు

           • నగదు బదిలీకి విస్తృత అవకాశాలు 
           • మరిన్ని అదనపు కౌంటర్ల ఏర్పాటు 
           • ప్రస్తుతానికి ఏటీఎంలలో రూ.50, రూ.100 నోట్లు 
           • శని, ఆదివారాల్లో పనిదినాలు? 
           • సురేష్ రెడ్డి లీడ్ బ్యాంకు మేనేజర్ తో నిజామాబాదు వార్త ఇంటర్వ్యూ

           కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం అనేక ఆర్థిక సంస్కరణలకు నాంది పలకబోతోందని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లధనం ఉన్న వారికి తప్ప మిగతా వారందరికి ఇబ్బందులేమి ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన వెల్లడించారు. గురువారం నుంచి బ్యాంకుల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయని ఏటీఎంలలో కొంత సమయం పట్టవచ్చన్నారు. అప్పటివరకు ఏటీఎంలలో పాత రూ.50, రూ. 100 నోట్లు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొ’న్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల వద్ద అదనపు కౌంటర్ల ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని చెప్పారు. రానున్న రెండో శని, అదివారాల్లో కూడా పనిదినాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని, దీంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని 252 బ్యాంకులు, 338 ఏటీఎంల పరిస్థితి ఏంటనే విషయాలపై ఆయన నిజామాబాదు వార్త.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో వివరాలు వెల్లడించారు.

           ప్రశ్న: పీఎం మోదీ ప్రకటనతో ప్రస్తుతం బ్యాంకుల పాత్ర ఏలా ఉండబోతోంది?
           ఎల్‌డీఎం: ప్రభుత్వం తీసుకున్న నగదు బదిలీ వ్యవహారంలో బ్యాంకులు క్రీయాశీలక పాత్ర పోషించనున్నాయి. ఖాతాదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా సేవలందించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేసేందుకు సిబ్బందిని సిద్ధం చేశాం.

           ప్ర: నేటి నుంచి బ్యాంకులు, ఏటీఎంలు ఎలాంటి సేవలను అందిస్తాయి?
           ఎల్‌డీఎం: బ్యాంకుల్లో లావాదేవీలు గురువారం ప్రారంభమవుతాయి. బుధవారం రోజు కూడా సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కొత్త కరెన్సీకి సంబంధించి, పాత నిల్వల గురించి అంతర్గతంగా పనులు చక్కదిద్దారు. ఐతే ఏటీఎంలు గురువారం కూడా తెరిచే పరిస్థితి లేదు. మళ్లీ 11న సేవలు ప్రారంభమవుతాయి. కొత్త కరెన్సీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అప్పటివరకు రూ. 50, రూ. 100 నోట్లను ఏటీఎంల ద్వారా అందిస్తాం.

           ప్ర: ప్రభుత్వం తాజాగా రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి?
           ఎల్‌డీఎం: శుక్రవారం వరకు మాత్రం ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌లైన్స్‌, రైల్వే, ఆర్టీసీ, డెయిరీ, ఆస్పత్రులతో పాటు పెట్రోల్‌బంకుల్లో తీసుకోవాలని అధికారులు చెప్పారు.

           ప్ర: బ్యాంకులతో పాటు నగదు మార్పిడి ఎక్కడైనా చేసుకునే వీలుందా? ఎప్పటివరకు చేసుకోవచ్చు?
           ఎల్‌డీఎం: ప్రధాన పోస్టాఫీసులు, సబ్‌పోస్టాఫీసుల్లో కూడా మార్పిడి చేసుకునే వీలుంది. డిసెంబరు 30 వరకు ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ ప్రత్యేక రంగాలకు, సంస్థలకు, వ్యక్తులకు గానీ నగదు మార్పిడి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అతితక్కువ కౌంటర్లలో వాటిని మార్చి 31 లోగా బదిలీ చేసుకునే వీలుంటుంది.

           ప్ర: ప్రస్తుతానికి అవసరాలకు తగ్గట్టు నగదు బదిలీ ఎలా చేసుకోవచ్చు?
           ఎల్‌డీఎం: ప్రస్తుతం ఏ బ్యాంకుకైనా ప్రజలు వెళ్లి పరిమితికి లోబడి నగదు బదిలీ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. బ్యాంకుల్లో ఇప్పటికైతే ఒక్కో వ్యక్తికి రూ. 4 వేల వరకు మార్పిడి చేసుకునే వీలుంది. తదనంతరం వీటి పరిమితిని రూ.10 వేలు, రూ.20 వేలకు పెంచుతారు. ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు రూ.2 వేల వరకే అందించే వీలుంది.

           ప్ర: బ్యాంకుల్లో ఖాతాలేని వారి పరిస్థితేంటి?
           ఎల్‌డీఎం: ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతా తెరిపించాలనేదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యం. అందుకే విద్యార్థులకు కూడా ఖాతాల ద్వారానే ఉపకార వేతనాలు అందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాతా ఎంత అవసరమో తెలిసివస్తుంది. అయితే ఖాతా లేనివారు ఖాతాదారుడి అభ్యంతరం లేదనే పత్రాన్ని రాసుకొని, తన ఏదైనా గుర్తింపుకార్డు చూపిస్తే మార్పిడికి అవకాశం ఉంటుంది. అది కూడా పరిమితులకు లోబడి.

           ప్ర: నగదు చెల్లింపులు అవసరమైతే ఎలా?
           ఎల్‌డీఎం: బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బులను తీసి కొత్త నోట్లతో నేరుగా డబ్బులు చెల్లించడమనేది కొంత కాలం ఇబ్బందికరంగా ఉంటుంది. ఐతే నేరుగా డీడీలు, చెక్కులు, నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, మొబైల్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌కార్డు, తదితరాల రూపంలో చెల్లింపులు చేసుకోవచ్చు.

           ప్ర: బ్యాంకుల వద్ద నేటి పరిస్థితి ఎలా ఉండవచ్చు?
           ఎల్‌డీఎం: జిల్లాలోని కొన్ని బ్యాంకులకు ఈపాటికే కొత్త కరెన్సీ వచ్చేసింది. ఐతే వీటితో లావాదేవీలు జరిపేందుకు జనం ఆసక్తి కనబరుస్తారు. వందలాది మంది క్యూ కట్టే ప్రమాదం ఉంది. అందుకే నిల్వల ఆధారంగా ఖాతాదారులకు అవకాశాలివ్వాలని చెప్పాం. ప్రస్తుతం ఉన్న డిమాండు దృష్ట్యా ప్రజలు ఆందోళన చేసే అవకాశాలుండడంతో బ్యాంకుల వద్ద పోలీసు భద్రతను కోరాం.

           ప్ర: వరుస సెలవులు వస్తున్నాయి. ఎలాంటి ప్రభావం చూపవచ్చు?
           ఎల్‌డీఎం: రెండో శని, అదివారాల్లో కూడా బ్యాంకులు సేవలందించాలని నిర్ణయించాం. నవంబరు 14న వచ్చే గురునానక్‌ జయంతిన తప్పనిసరిగా సెలవుదినం పాటించే వీలుంది.

           ప్ర: వివాహం, ఇతరత్రా శుభకార్యాలు, రైతుల చెల్లింపులు, తదితర ఇబ్బందులను ఎలా అధిగమించాలి?
           ఎల్‌డీఎం: పరిస్థితి చక్కబడే వరకు ఒపిక పట్టాల్సిందే. డబ్బుల వ్యవహారాలు ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో చేసుకోవచ్చు. లేదంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

           ప్ర: నోట్ల రద్దు వ్యవహరం ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది?
           ఎల్‌డీఎం: ముఖ్యంగా నల్లధనం ఉన్నవారు దీనితో దారికొస్తారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, లైసెన్సులేని వ్యాపారులు, ఫైనాన్స్‌ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పవు


            బాక్సింగ్‌లో నిఖత్‌కు బంగారు పతకం

            నవంబర్ 10, నిజామాబాదు వార్త.కామ్: 
            ఇందూరుకు చెందిన అంతర్జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌జరీన్‌ వరంగల్‌లో ఈ నెల 6,7 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్‌ పురుషులు, మహిళల బాక్సింగ్‌లో రాణించి బంగారు పతకం సాధించింది. 51కిలోల కేటగిరిలో పోటీపడి ప్రత్యర్థిని నాకౌట్‌ చేసింది. రాష్ట్ర పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు ఎంపికైంది. జాతీయటోర్నీ ఉత్తర్‌ఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ నెల 19వ తేది నుంచి 24 వరకు జరగనుంది.


             వైద్యుడి కిడ్నాప్‌ కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు

             నవంబర్ 10, నిజామాబాదు వార్త.కామ్: 
             బోధన్‌లోని ప్రముఖ వైద్యుడు సుధీర్‌గోజే కిడ్నాప్‌ కేసులో ఇద్దరు నిందితులకు జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 2008 ఆగస్టు 28న సాయంత్రం పట్టణ శివారులో సాయంత్రం నడక కోసం కారులో డ్రైవర్‌ను వెంటబెట్టుకుని వెళ్లారు. నడక ముగించుకొని తిరిగి కారులో వెనుక్కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా రెండు వైపుల నుంచి లోనికి ప్రవేశించారు. ఒకరు మెడపై కత్తి పెట్టగా, మరొకరు డ్రైవర్‌ను నకిలీ పిస్టల్‌తో బెదిరించి కారును వేగంగా తీసుకెళ్లమని చెప్పారు. జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను గమనించి డాక్టర్‌ గట్టిగా కేకలు వేశారు. దీంతో భయపడిన నిందితులు కారు దిగేసి పారిపోయారు. ఆ సమయంలో వారిలో ఒకరి పర్సు కారులో పడిపోయింది. అందులో నిందితుల ఓటరు గుర్తింపు కార్డు, ఫొటోలు లభించాయి. వాటి సాయంతో బోధన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఎడపల్లి మండలం దుబ్బతాండ చెందిన గగ్లోత్‌ శ్రీను, శంకర్‌లను నిందితులుగా తేల్చారు. గతంలో వీరు వైద్యుడి వద్ద తమ బంధువుని చికిత్స కోసం చేర్పించగా డబ్బులు ఎక్కువ తీసుకున్నారనే భావనతో ఆయన్ను కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలు చేద్దామనే వ్యూహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో నిందితులిద్దరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. పోలీసుల తరపున సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మంజులదేవి వాదించారు.

             అతివేగానికి నిండు ప్రాణం బలి

             రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి

             నవంబర్ 10, నిజామాబాదు వార్త.కామ్:
             అతి వేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌ అభ్యాస పాఠశాల వద్ద మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 4వ ఠాణా ఎస్సై మధు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వినాయక్‌నగర్‌ విజయలక్ష్మి గార్డెన్‌ సమీపంలో నివాసం ఉండే సాయిబాబా కుమారుడు దినేష్‌కుమార్‌(20) డిగ్రీ పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులను కలవాల్సి ఉండగా నిజామాబాద్‌కు వచ్చాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా.. అభ్యాస పాఠశాల వద్ద మరో (ఎఫ్‌జెడ్‌)ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో దినేష్‌కుమార్‌ కింద పడిపోగా తలకు బలమైన గాయాలయ్యాయి. అనంతరం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబీకుల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. ఇటు ఈ ప్రమాదంలో ఎఫ్‌జెడ్‌పై ఉన్న శ్రీనివాస్‌ అనే యువకుడికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగో ఠాణా ఎస్సై మధు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
             సుమో అమ్మిన తండ్రి
             తన కొడుకు చదువుల కోసం తండ్రి సాయిబాబా తనకున్న ఒక్క ఆధారం ప్రైవేటు వాహనాన్ని అమ్మివేశాడు. ఇటీవల విద్యారుణం కోసం దరఖాస్తు చేయగా.. మంజూరు కావడంతో ఇంటికి రావాలని కొడుక్కి కబురు పెట్టాడు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.

             డబ్బు ఆశతో దారుణానికి ఒడిగట్టిన భార్య..!


             ప్రియుడితో కలిసి ఆభరణాల వేలం
             ఓ ముఠాతో రూ. 10 లక్షలకు డీల్‌
             ఏడుగురు నిందితుల అరెస్టు
             రెండు లక్షల నగదు, పిస్టల్‌..
             కత్తులు, వేటకొడవళ్లు,14 సెల్‌ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం
             కేసును ఛేదించిన పోలీసులు

             నవంబర్ 10,  వార్త.కామ్:

             వివాహేతర సంబంధమే కడతేర్చింది. డబ్బు ఆశతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌ వేసింది. రెక్కీ నిర్వహించి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన మౌలాలి హౌసింగ్‌ బోర్డు కాలనీ నోముల రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్‌ 29వ తేదీన జరిగింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షలు, పిస్టల్‌, 7.65 లైవ్‌ కాలిబర్‌ రౌండ్‌, 5 కత్తులు, రెండు వేట కొడవళ్లు, 14 మొబైల్‌ ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ బుధవారం వెల్లడించారు.

             ఆర్థిక సమస్యలు.. తరచూ గొడవలు
             మౌలాలి హౌసింగ్‌ బోర్డు కాలనీ నోముల రెసిడెన్సీలో గోపాలకృష్ణ, అతడి భార్య నాగ వినీలతో కలిసి నివసిస్తున్నాడు. గోపాలకృష్ణ బ్యాంక్‌లో రూ. 2 కోట్ల రుణం తీసుకుని డైరీ ఫాం నెలకొల్పాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తల్లి, భార్య, సోదరికి చెందిన 3కిలోల బంగారు ఆభరణాలను ఓ బ్యాంక్‌లో కుదవపెట్టి మళ్లీ లోన్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్యకు బ్యాంక్‌ మేనేజర్‌.. ప్రధాన నిందితుడు దుండ రవీందర్‌తో పరిచయం ఏర్పడడంతో వివా హేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అప్పులు ఎక్కువకావడంతో ఆమె తరచూ గొడవపడేది. కొన్ని రోజుల తర్వాత బ్యాంక్‌ మేనేజర్‌తో సూర్యాపేటలో వేరు కాపురం పెట్టింది. డబ్బు ఆశతో బంగారు ఆభరణాలను బ్యాంక్‌ మేనేజర్‌ వేలం వేశాడు. గోపాలకృష్ణ తనవద్ద ఉన్న ఐదెకరాల భూమి అమ్మి నగలు విడిపించుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలిసిన రవీందర్‌, నాగ వినీల భయభ్రాంతులకు గురయ్యారు. ఆభరణాలు ఎక్కడి నుంచి తీసుకు రావాలని.. ఈ సమస్యకు పరిష్కారం గోపాలకృష్ణను హత్య చేయడమే మార్గమని పథకం వేశారు. రవీందర్‌ అతడు పనిచేసే బ్యాంక్‌లో ఖాతాదారుడైన రాజేంద్రనగర్‌కు చెందిన గొల్ల యాదయ్యను సంప్రదించి విషయం చెప్పాడు. యాదయ్య అతడి స్నేహితుడు మహ్మద్‌ మన్సూర్‌ను పరిచయం చేశాడు.

             మన్సూర్‌ రూ. 10లక్షలు ఇస్తే హత్య చేసే జబేర్‌ ముఠా ఉందని రవీందర్‌కు చెప్పాడు. అతడు జబేర్‌ను కలిసి 3లక్షల అడ్వాన్స్‌ ఇచ్చాడు. నాగ వినీల నోముల రెసిడెన్సీలో రెక్కీ నిర్వహించింది. అపార్ట్‌మెంట్‌లో చిన్న పిల్లలు టెర్రస్‌పై ఆడు కుంటుండగా వారికి బాణసంచా కొనుక్కోమని డబ్బులిచ్చి కిందకు పంపించింది. ఆ తర్వాత జబేర్‌ ముఠాకు సమాచారం అందించింది. జబేర్‌, వాహిద్‌, మహ్మద్‌ హాజీ భవనంలోకి ప్రవేశించారు. జబేర్‌ పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గురితప్పడంతో వాహిద్‌, మహ్మద్‌ హాజీ కత్తులతో దాడి చేశారు. 54 పోట్లు పొడిచారు. గోపాలకృష్ణ మరణించడంతో అక్కడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. దుండ రవీందర్‌, శెట్టిపల్లి నాగ వినీల, మహ్మద్‌ జబేర్‌, అబ్దుల్‌ అస్గర్‌, మహ్మద్‌ హాజీ, మహ్మద్‌ మన్సూర్‌, గొల్ల యాదయ్యను అరెస్టు చేశారు. వాహిద్‌ అలీ, జితేందర్‌సింగ్‌ పరారీలో ఉన్నారు.

             హత్యకేసుల్లో నిందితులు
             నిందితులు నగరంలో జరిగిన పలు హత్యకేసుల్లో ప్రధాన సూత్రధారులని సీపీ మహేశ్‌ భగవత చెప్పారు. జబేర్‌పై చాంద్రాయణగుట్టలో రౌడీషీట్‌ నమోదైందని, రాజేంద్రనగర్‌, బహదూర్‌పురా హత్యకేసుల్లో అతడి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లికి చెందిన వాహిద్‌పై బహదూర్‌పురా, అంబర్‌పేటలో హత్యకేసు, ఉప్పల్‌లో ఆమ్స్‌ యాక్ట్‌ కేసులు, మహ్మద్‌ హాజీపై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో హత్యకేసు నమోదైందని తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టల్‌ను నాందేడ్‌కు చెందిన జితేందర్‌సింగ్‌ వద్ద కొనుగోలు చేశారని చెప్పారు. బ్యాంక్‌ అధికారులకు తెలియకుండా బంగారు ఆభరణాలు వేలం వేయడం చట్టప్రకారం నేరమని, రవీందర్‌పై మరో కేసు నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ శశిధర్‌రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు

             Tuesday, 8 November 2016

             చేపూర్లో ఉపాధ్యాయులపై తేనెటీగల దాడి
             నవంబర్ 8, నిజమాబాద్ వార్త.కామ్:
             ఆర్మూర్ రూరల్ మండలం చేపూర్లోని క్షత్రియ కళాశాల అవరణలో మంగళవారం ఉపా ధ్యాయులపై తేనెటీగలు దాడి చేశాయి. కళాశాలలో జిల్లా సాయి కంప్యూటర్ పరిజానంపై ఉపా ధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో చెట్లపై ఉన్న తేనెటీగలు ఉపాధ్యాయులపై దాడి చే సి కుట్టాయి. తేనెటీగల దాడిలో కోటగిరికి చెందిన ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయ పడ్డారు. తీ వ్ర గాయాలైన ఆయనను ఎంఈవో రాజగంగారాం, ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
             మల్లారం అటవీ ప్రాంతంలో ఒకరి హత్య
             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
             నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో బాదావత్ సురేష్ (17)అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కలిసి హత్యచేశారని రూరల్ సీఐ వెంకటేశ్వరు తెలిపా రు. సీఐ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చక్రధర్నగర్ తండాకు చెందిన సురేష్ గాంధీనగర్ తండాకు చెందిన పరుశురాం, రాజు, శ్యాంరావులు కలిసి రెండు రోజుల క్రితం పేకాట ఆడారు. జూదంలో సురేష్కు డబ్బులు ఎక్కువగా వచ్చాయి. దీంతో అందరూ కలిసి మ ద్యం తాగారు. పరుశురాం, రాజు, శ్యాంరావులు ఒక పథకం ప్రకారం సురేష్తో ఎక్కువ మొత్తంలో మద్యాన్ని తాగించారు. అనంతరం స్పహలోలేని సురేష్ను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు సీఐ వివరించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన సురేష్ ఇంటికి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు రెండురోజుల క్రితం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తిస్తాయి విచారణ జరపగా సురేష్ వెంట వెళ్లిన వారిని విచారించగా అసలు కథ బయటకు పడింది. మంగళవారం రూరల్ సీఐ వెంకటేశ్వరు, ఎన్హెచ్.వో జగదీశ్లు సంఘటన స్థలాన్నిసందర్శించి సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్త జరుపుతున్నామని అన్నారు. శవాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
             చక్రధర్నగర్ తండాలో విషాదం.
             అదృశ్యమైన సురేష్ హత్యకు గురైన సంఘటన తెలియడంతో తండాలో విషాదఛాయలు నెల కొన్నాయి. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
             అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ 18

             నవంబర్ 8, నిజామాబాద్ వార్త.కామ్:
             డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 చివరి తేదీ అని ప్రాంతీయ స మన్వయ కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ డీసమ్మయ్య తెలిపారు. అభ్యరు లు ఒక్కో పేపర్కు రూ.100 చొప్పున టీఎస్/ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. తృతీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 28 నుంచి, ద్వితీయ సంవ త్సర పరీక్షలు డిసెంబరు ప్ నుంచి, ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబరు 13 నుంచి జరుగుతాయని, మరిన్ని వివరాలకు 7382929612కు సంప్రదించాలన్నారు.
             పాత రూ. 500, 1000 మీ దగ్గర ఉన్నాయా.. అయితే ఇలా మార్చుకోండి... 

             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:

             పాత 500, వెయ్యి నోట్లు చెల్లవని ప్రకటించినందున... సామాన్యుల తక్షణ అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 72 గంటలపాటు అంటే... ఈనెల 11వ తేదీ రాత్రి 12 గంటల వరకు... కల్పించిన వెసులుబాట్లు ఇవి... 
             •  ఈ 72 గంటలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లనూ తీసుకుంటారు. 
             •  వైద్యుల రాసిన మందుల చీటి చూపించి... మెడికల్‌ షాపుల్లోనూ పాత 500, వెయ్యి నోట్లతో ఔషధాలు కొనవచ్చు. రోగులకు చికిత్సలో ఇబ్బంది రాకుండా ఈ ఏర్పాటు! 
             •  72 గంటలపాటు రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ప్రభుత్వ బస్‌ టికెట్‌ కౌంటర్లు, విమానాశ్రయాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ టికెట్‌ కౌంటర్లలో 500, 1000 పాత నోట్లు చెల్లుతాయి. ప్రజల ప్రయాణ ఏర్పాట్లకు ఆటంకం కలుగకుండా ఈ వెసులుబాటు! 
             •  ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే పెట్రోలు బంకులు, గ్యాస్‌ స్టేషన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల స్టోర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిల్క్‌ బూతల్లోనూ 72 గంటలపాటు చెల్లుబాటు అవుతాయి.

             పెట్రోల్ బంక్, కిరాణా షాపుల వద్ద క్యూ

             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 500, 1000 నోట్లు మార్చుకునేందుకు నిజామాబాదు నగరంలో  పెట్రోల్‌ బంక్‌ల వద్ద, కిరాణా దుకాణాల వద్ద ప్రజలు క్యూకట్టారు. మరోవైపు పెట్రోల్ బంక్‌లలో పాతనోట్లు చెల్లే అవకాశం ఉన్నా చిల్లర ఇవ్వడం లేదు. దీంతో వినియోగదారులు రూ. 500 మొత్తానికి పెట్రోల్‌ పోయించుకుంటున్నారు.

             ఇకపై రూ. 500, 1000 చెల్లవు.. 
             భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం 

             • 4 వేల వరకు నేరుగా ఎక్కడైనా మార్పిడి
             • గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి
             • బ్యాంకుల పని వేళలు, కౌంటర్లు పెంపు
             ఇది... సంచలన నిర్ణయం! దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే నిర్ణయం! నరకాసుర వధ జరిగిన కొన్నాళ్లకే... నల్ల ధనాసురుల’పై యుద్ధం! మోదీ... పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సాహసోపేత నిర్ణయం!

             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
              
             మీ జేబులో 500 లేదా వెయ్యి నోటు ఉందా? ఇంటి బీరువాలో అవే నోట్లు కట్టలు ‘కట్టలు’గా ఉన్నాయా!? మంగళవారం అర్ధరాత్రితో వాటికి కాలం చెల్లిపోయింది! అవి ఇప్పుడు చెల్లని కాగితాలతో సమానం. వాటి ‘విలువ’ కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది! మీకు ఖాతా ఉన్న బ్యాంకుకో, పోస్టాఫీసుకో వెళ్లండి! పాత 500, వెయ్యి నోట్లను జమ చేయండి! ఇందుకు డిసెంబరు 30 వరకు... అంటే 50 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత ఇక ఒకే ఒక చాన్స్‌. డిసెంబరు 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు ఆర్‌బీఐ నిర్దేశించిన కేంద్రాల్లో... ఒక డిక్లరేషన్‌ సమర్పించి పాత 500, 1000 నోట్లు జమ చేసుకోవచ్చు. కష్టపడి, నిజాయితీతో, అధికారికంగా సంపాదించుకున్న సొమ్ములైతే కాపాడుకోండి! కోట్లకు కోట్లు అక్రమంగా కూడబెట్టుకున్న నల్ల దొరలకు మాత్రం సంకటమే!

             ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నల్లధనం’పై వీర ఖడ్గం ఎత్తారు. వెయ్యి, ఐదొందల కరెన్సీ నోట్లపై కత్తి వేటు వేశారు. నల్ల దొరలకు అనూహ్య, ఆకస్మిక షాక్‌ ఇచ్చారు. నల్లధనం అరికట్టడంపై ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన మోదీ... మంగళవారం రాత్రి ఒక్కసారిగా బాంబు’ పేల్చారు. త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ, దౌత్య అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ... మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పేలా 500, 1000 నోట్ల రద్దు గురించి ప్రసంగించారు. పేదల కష్టాలు, అవినీతి సమస్యకు ప్రధాన కారణం నల్ల ధనమే అని తేల్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం... ఇవే దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు. అమాయకులను బలి తీసుకుంటున్న ఉగ్రవాదులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. నకిలీ కరెన్సీని సరిహద్దులను దాటించి... భారతలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఏదో ఒక్క సందర్భంలో వస్తుందన్నారు. ఆ నిర్ణయాత్మక సమయం ఇప్పుడే వచ్చిందన్నారు. నల్ల దొరలు పరుపుల కింద దాచిన నల్లధనం నశించాల్సిందేనని తెలిపారు. తాము తీసుకున్న చర్యలతో ఇప్పటికే 1.25 లక్షల కోట్ల నల్లధనం బయటికి వచ్చిందన్నారు. దీపావళి మరుసటి రోజు చెత్తా చెదారాన్ని ఊడ్చేసినట్లే... దేశం నుంచి నల్లధనాన్ని ఊడ్చేయాలన్నారు. దీనికి 50 రోజుల ప్రణాళిక ప్రకటించారు. ఇక... గురువారం నుంచి కొత్త 2వేలు, సరికొత్త డిజైన్‌తో ముద్రించిన 500 నోట్లు చలామణిలోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌ ప్రకటించారు.
              
             దేశ విద్రోహులు, సంఘ వ్యతిరేకుల వద్ద ఉన్న పాత 500, 1000 నోట్లు ఇక చిత్తు కాగితాలతో సమానం!

             దీపావళి మరుసటి రోజున మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నట్లే... నల్లధనం, నకిలీ కరెన్సీ నుంచి దేశాన్ని స్వచ్ఛం చేయాలి!
             -నరేంద్ర మోదీ
              

             Monday, 7 November 2016

             కాంగ్రెస్ మైనార్టీ విభాగం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
             నవంబర్ 8, నిజామాబాద్ వార్త.కామ్
             కాంగ్రెస్పార్టీ మైనార్టీ విభాగంజిల్లాకమిటీలో నూతనంగా ఇద్దరికి స్థానం కల్పించారు. వర్ని గ్రామానికి చెందిన అబుల్ భారీని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మోస్రా గ్రామానికి చెందిన షెక్ జలీల్ ను జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా నియమించారు. మైనార్టీవిభాగం రాష్టఅధ్యక్షుడు మహమ్మద్ ఖాజా వీరిని నియామిసూ ఉత్తర్వులు ఆదేశాలు జారీచేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్హందాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మైనార్టీ విభాగం జిల్లాచైర్మన్ సుమీర్, పార్టీనగర అధ్యక్షుడు కేశ వేణుతో, పలువురు పాల్గొన్నారు.
             శ్రీమేధావి విద్యారుల ప్రతిభ

             నవంబర్, 8 నిజామాబాదు వార్త.కామ్:
             జూనియర్ కళాశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్, జూడోలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనటు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ప్రతిభ కనబరిచిన ವಿದ್ದಣ್ಣ రులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఇటీవల జగిత్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలో నాగ ఫణీంద్ర ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని, జిల్లా స్థాయి జూడో పోటీల్లో రాజ్ కుమార్, వెంకటేశ్లు మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు భూపతిరెడ్డి, పవన్, ప్రదీ ప్రెడ్డి పాల్గొన్నారు.
             ఉపాధి కోసం అభ్యరుల ఎంపిక
             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
             పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఎన్యూఎల్ఎం పథకం ద్వారా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అభ్యర్థుల ఎంపికను నిర్వహిస్తున్నట్లు మెప్మా పథక సంచాలకులు జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన రెండు కంపెనీల వారు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ నగరంలోని కొత్త అంబేడ్కర్ భవన్లో, ఈ నెల 10న బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్ పట్టణంలో ఈ నెల 16న అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండి, వయసు 18-35 కల్గిన నిరుద్యోగులైన యువతీయువకులు తమ వ్యక్తి గత వివరాలతో పాటు ఆధార్ కార్డు, మార్కుల జాబితా, రెండు పోస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. కంపెనీ వారు సూచించిన కోర్సుల్లో మాత్రమే ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్ల తెలిపారు.
             డయల్ యువర్ సీపీలో 15 ఫిర్యాదులు
             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
             డయల్ యువర్ సీపీ కార్యక్రమంలో భాగంగా 15 ఫిర్యాదులు అందాయి. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో సీపీ కార్తికేయ ఫోన్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
             పేదల పాలిటి వరం... ఈ కేంద్రం
             ప్రారంభానికి సిద్దమైన "నిరాశ్రయుల కేంద్రం"
             నవంబర్ 8, నిజామాబాదు వార్త.కామ్:
             పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ నిరాశ్రయుల కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో గల శిధిలావస్థలో ఉన్న మున్సిపల్ పాత అతిథిగృహంలో ప్రస్తుతం ఈ కేంద్రం కొనసాగుతుంది. అయితే ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో దాని పక్కనే ఉన్న మరో భవనానికి మరమ్మతులు చేసి ముస్తాబు చేశారు.
             నగరంలోని బస్టాండు, రైల్వేస్టేషన్తో పాటు ఇతర చోట్ల రోడ్లపై రాత్రి పూట నిద్రించే నిరాశ్రయుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ. 12.04 లక్షలతో భవనానికి మరమ్మతులు చేయించారు. అందులో ఉండే వారికి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్రం లోపల మంచాలను ఏర్పాటు చేశారు. చలికాలం కావడంతో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని దుప్పట్లను ఇస్తున్నారు. ప్రతి రోజు ఎక్కడో పని చేసుకోని రాత్రి నిద్రించేందుకు ఈ కేంద్రా నికి 50 మంది వరకు వస్తుంటారు. గతంలో భోజన వసతి కల్పించే వారు కాదు. కేంద్రంలో ఉంటున్న కొందరు పుడ్ కమి టీగా ఏర్పడి వంట చేయడం ప్రారంభించారు. వంటకు అవసరమైన పొయ్యి సిలెండర్ను అధికారులు ఇస్తుండగా వంట పాత్రలు, వంట సరకులు కమిటీ సభ్యులే తెచ్చుకుంటారు. అన్నంతో పాటు ఒక కూర ప్రతి రోజు ఒక పూట భోజనం ఉండగా దీనికి రూ.20 తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం కేంద్రానికి వచ్చే నిరాశ్రయులకు ఎంతో ఉపయోగపడుతుంది. మెప్మా పీడీ జనార్టన్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే కేంద్రం బాగు పడింది.
             ఆహ్లాదకరమైన వాతావరణం...
             పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్వాహకులు కల్పించారు. ఇక్కడికి వస్తే మళ్లీ బయటకు వెళ్లకుండా ఇక్కడే రాత్రి సమయంలో నిద్రపోయే విధంగా కావల్సిన ఏర్పాటు చేశారు. ప్రతి రోజు కేంద్రంలోకి వచ్చే వారికి కాలక్షేపం కోసం రాత్రి పూట ఒక గంట పాటు టీవీ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో ఏర్పాట్లు బాగుండటంతో ఇక్కడికి వచ్చిన వారు బయటకు వెళ్లిపోకుండా ఇక్కడే ఉంటున్నారు. గతంలో మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉండేవి కావు. ఇప్పుడు వాటిని నిర్మించడంతో అందరికి సౌలభ్యంగా ఉంది. కేంద్రం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కేంద్రంలో ఉండే వారు మొక్కలకు నీళ్లు పోసి వాటిని రక్షిస్తున్నారు. ఈ కేంద్రంలో ఒక మేనేజర్తో పాటు ముగ్గురు సంరక్షకులు పని చేస్తున్నారు.
             ఆస్పత్రిలో మరో కేంద్రం
             నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు తలదాచుకునేందుకు గాను అక్కడే మరో పట్టణ నిరాశ్రయుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గాను రూ. 50 లక్షల వరకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ భవన నిర్మాణానికి పాలనాధికారిణి యోగితా రాణా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కేంద్రం ఏర్పాటు అయితే ఆస్పత్రి రోగుల బంధువులకు ఎంతో ఉపయోగంలో ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి తీసుకోవచ్చు.
             త్వరలోనే ప్రారంభిస్తాం
             -జనార్టన్, పథక సంచాలకులు, మెప్మా
             నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా నిర్మించిన పట్టణ నిరాశ్రయుల కేంద్రంను త్వరలోనే ప్రారంభిస్తాం. గతంలో కంటే ఈ సారి కేంద్రంలో కావల్సిన సౌకర్యాలు పెంచాం. నిరాశ్రయులు ఎవరూ రోడ్డుపై పడుకోకుండా కేంద్రంలోనే పడు కునే విధంగా చూస్తున్నాం. కేంద్రానికి వచ్చే వారికి త్వరలోనే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం.

             Sunday, 6 November 2016

             డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
             పోలీస్ కమిషనర్ కార్తికేయ
              నవంబర్ 7, నిజామాబాదు వార్త.కామ్:
             పోలీసుశాఖ ద్వారా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ సూచించారు. పోలీసులంటే భయం కారణంగా పోలీసు స్టేష న్లకు వెళ్లలేక బాధపడే ఫిర్యాదు దారులకు ఇది సదవకాశమని ఆయన పేర్కొన్నారు. డయల్ యువర్ సీపీ ద్వారా తమ తమ ఫిర్యాదులు నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీపీ కార్యక్రమానికి ప్రజలు సకాలంలో కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రతీ సోమవారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుందన్నారు. ఫిర్యాదుదారులు 08462 228433 నెంబర్కు పోన్ చేసి, తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. డయల్ యువర్ సీపీ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేవారు ముందుగా తమ ఫోన్నెంబర్ పేరు, చిరునామా తెలియజేయాలని, అనంతరం తమ సమస్యను క్షుణంగా తెలపాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో సమయం వృధా చేయకుండా ఇతరులకు కూడా అవకాశం కల్పించే విధంగా మసలుకోవా లన్నారు. ముఖ్యమైన సమస్య ఉన్నవారికి మొదట అవకాశం కల్పించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
             నవంబర్ 7, నిజామాబాదు వార్త.కామ్: 
             నిజామాబాదు జిల్లా అధికారుల మొబైల్ నంబర్స్:             నవంబర్ 7, నిజామాబాదు వార్త.కామ్: 
             నిజామాబాదు నగరంలో సినిమాలు 


             'మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలి'
              నవంబర్ 7, నిజామాబాదు వార్త.కామ్: 
             హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు యజ్ఞంలా చేపట్టాలని నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం సూచించారు. మహేశ్వరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని దుబ్బకాలనీలోని మహేశ్వరీ భవన్ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాటాడుతూ, సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారీఎత్తున స్వంత నిధులతో యాగం నిర్వహించారన్నారు. దీంతో వరాలు సమృద్దిగా కురిసాయన్నారు. భావితరాలకు ఉపయోగపడే హరితహారం కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు చేపట్టడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మహేశ్వరీ సమాజ్కు నగరపాలక సంస్థ సహకారం ఉంటుందని ఆమె హామీ ఇ చ్చారు. అనంతరం మేయర్ను ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో 40వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ నితిన్ పాండే, మహేశ్వరీ, మహిళా మండలి, యువమంచ్, ట్రస్ట్ ప్రతినిధులు కుంజ్బీహరీ, ఓంప్రకాష్ మోదానీ, సంపత్ బంగ్, సత్యనారాయణ గిల్దా, రాంవిలాస్, ఓంప్రకాష్, రాజారాం సారడా తదితరులు పాల్గొన్నారు

             జీవితం కష్టసు ఖాల ప్రయాణం: సుందర చైతన్యానంద స్వామి

             నవంబర్ 7,  నిజామాబాదు వార్త.కామ్: 
             మనిషి జీవితం కష్టసుఖాల ప్రయాణం అని సుందర చైతన్యానంద స్వామి ఉద్బోదించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 231వ జ్ఞ్యాన యజ్ఞాన్ని ఓంపతాక ఆవిష్కరణ జ్యోతిప్రజ్వలనతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేసూ జీవితంలో కష్టము అనేది మనలోనే దాగి ఉంటుందని, దాన్ని భక్తిమార్గంలో ప్రయాణిసూ అధిగమించవచ్చని తెలిపారు. భక్తిమార్గంలో నడిచే భ క్తులకు భగవంతుడు కష్టసుఖాలను కలిగిస్తారని దాన్ని ఎదుర్కొనే సామర్యాన్ని కూడా మనకు అందిస్తాడని అన్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిర్దేశించినట్లుగా ప్రతీ ఒక్కరు కర్మను చేయాలని ఫలితాన్ని భగవంతుడికి వదిలివేయాలన్నారు. నేటి ఆధునిక జీవితంలో ప్ర తీ ఒక్కరు ఏదోఒక సమస్యతో భాదపడుతున్నారని,
             ధ్యానము, భక్తిమార్గం ద్వారానే సమస్యను అధిగమించవచ్చన్నారు. అంతకుముందు భక్తులు బోర్గాం నుండి మురళీకృష్ణ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. సుందరదైతన్యానంద స్వామి 231వ జ్ఞ్యానయజ్ఞం లో మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు, బిగాల కృష్ణమూర్తి దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సును పొందారు. సుందరదైతన్యానంద స్వామి ప్రవచనం ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి 8 గంటల వరకు కైవల్యోపనిషత్తుపై ప్రవచనం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు శ్రీమత్ భగవతం దశమస్కంధంపై ప్రవచనం ఉంటుందని అన్నారు.

             ఆర్మూర్కు రూ. కోటి నిధుల విడుదల

             నవంబర్ 6, నిజామాబాదు వార్త.కామ్:
             ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ఫండ్ కింద రూ. 1.45 కోట్ల మంజూరు అయ్యాయి. వీటి ద్వారా 48 రకాల పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి శనివారం జీవో జారీ అయింది. జనరల్ పనులు 36 కాగా వీటికి రూ. 1.13 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ షాన్ పనులు 10 చేపట్టగా వీటికి రూ. 25. 50 లక్షలు ఖర్చు చేస్తారు. గిరిజనుల కోసం రెండు పనులు రూ. 6 లక్షలతో చేపట్టనున్నారు.