Friday, 24 May 2019

ఈ విజయం బీజేపీ కార్యకర్తల విజయం

‒ ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్‌‌ వార్త: పార్లమెంట్‌‌ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల విజయమని, ముఖ్యంగా యువకులు, మహళలు బీజేపీ గెలుపుకునకు కృషి చేసారని, బీజేపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఆయన శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.


నిజామాబాదు పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం:

నిజామాబాదు పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం:
మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి

Thursday, 23 May 2019

తొలి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం

జనసేన పార్టీ స్థాపించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. అతను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.


జగన్ బాహుబలి.. నేను దేవసేన: వైరల్ గా మారిన శ్రీరెడ్డి వ్యాఖ్యలు

ap 2019 assembly elections సందర్భంగా సంచలన నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి..

చంద్రబాబు.. నీకు నా ఉసురే తగిలింది

ap 2019 assembly elections ఫలితాల సందర్భంగా నగరి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రోజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కామెంట్స్ చేసారు.


Saturday, 18 May 2019

కాపురాలు కూల్చుతున్న పబ్‌జీ..

ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!

నిజామాబాద్‌‌ వార్త: పబ్‌జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్‌జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్నారు.. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జీ అదేపనిగా ఆడుతూ చాలామంది యువకులు నరాల బలహీనతతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా కూడా జనాల్లో చైతన్యం రావడం లేదు. ఇక ఓ వివాహిత పబ్‌జీ ఆటకు అలవాటు పడి సంవత్సరం కూడా నిండని పాపను సైతం వదిలి విడాకులు కోరడం గమనార్హం. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

ఇదేక్కడి చోద్యం 
పబ్‌జీ బానిస.. డైవోర్స్ కావాలట..!

20 ఏళ్ల యువతికి బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న యువకుడితో పెళ్లి అయింది. వారికి సంవత్సరం వయసులోపు పాప ఉంది. అయితే పబ్‌జీ ఆటకు బానిసగా మారిన ఆ యువతి విడాకులు కావాలంటూ రచ్చకెక్కడం గమనార్హం. ఆ మేరకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి అభయం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి డైవోర్స్ ఇప్పించాలంటూ కోరింది.

కాపురంలో ఆట చిచ్చు 
ఆటలో ఒకడితో కనెక్షన్ కుదిరిదంట..! వాడితో ఆడుకుంటుందట..!

ఇంతకు విడాకులు ఎందుకు కోరిందంటే.. పబ్‌జీ ఆటలో భాగంగా పరిచయమైన యువకుడితో జీవితం పంచుకుంటుందట. ఆ మేరకు అభయం హెల్ప్ లైన్ కౌన్సిలర్లకు వివరించిందట. అప్పుడైతే ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఎంచక్కా గేమ్ ఆడుకోవచ్చని తెలిపిందట. ఆమె సమాధానానికి విస్తుపోయిన కౌన్సిలర్లు.. కొంతకాలం అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరంలో ఉండాలని సూచించారు. అయితే అక్కడ ఫోన్లు అనుమతించరు. ఆ విషయం తెలిసి సహాయక శిబిరానికి వెళ్లబోనంటూ మొండికేసింది.

పబ్‌జీ మాయ 
వింత కేసు.. ఆట కోసం కాపురం వదులుకుంటారా?

సాధారణంగా తమ పిల్లలు పబ్‌జీ ఆటకు బానిసలయ్యారంటూ అభయం హెల్ప్ లైన్‌కు ఫోన్ కాల్స్ వస్తాయి. అయితే విచిత్రంగా నెలల వయసున్న కూతురిని కాదనుకుని.. ప్రేమగా చూసుకునే భర్తను వద్దనుకుని ఇలా విడాకుల కోసం రావడం ఇదే మొదటి కేసు అంటున్నారు నిర్వాహకులు. పబ్‌జీ మాయలో పడి తన జీవితం నాశనం చేసుకోవాలనుకుంటే చూస్తూ కూర్చోమంటున్నారు అభయం కౌన్సిలర్లు. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ద్వారా ఆమె మానసిక ప్రవర్తనలో మార్పు తెస్తామంటున్నారు.

పబ్‌జీ ఆట కట్టెదెన్నడో..! 
జీవితాలు నాశనం.. పచ్చని కాపురాల్లో చిచ్చు..!

పబ్‌జీ మాయలో పడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ ఆటలో మునిగిపోయి నరాల బలహీనత కారణంగా ఇటీవల కొందరు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. అదే ధ్యాసగా పబ్‌జీ ఆడుతుంటే మానసిక ప్రవర్తనలో తేడా కొడుతోంది. దాంతో కొందరు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. క్షణకాలం ఫోన్ చేతిలో లేకుండా అదోలా ఫీలవుతున్నారు. యువకులు బానిసలు కావడమే గాకుండా.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న పబ్‌జీ ఆట కట్టెదెన్నడో.కమెడియన్ ధన్‌రాజ్ దూలతీరింది..

పవన్‌ కల్యాణ్‌కువచ్చే సీట్ల గురించి పోస్ట్.. ట్రోల్స్‌తో నెటిజన్ల రచ్చ

నిజామాబాద్‌‌ వార్త: ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా ఎన్నికల జరగడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొన్నది. గత ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ చేసినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కొన్నివర్గాలు మాత్రం జనసేనను అంత తేలికగా తీసుకోవద్దని వెల్లడిస్తున్నాయి. అయితే జనసేన సాధించే సీట్లను అంచనా వేసిన యాక్టర్ ధన్ రాజ్ పప్పులో కాలేసినట్టు కనిపిస్తుంది. అసలేం జరిగిందంటే...

ఏపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన ఏపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం ఇప్పటికీ చర్చనీయాంశమవుతున్నది. అంతేకాకుండా జనసేనను టార్గెట్ చేసుకొని భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనసేన సాధించే సీట్ల గురించి టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కామెడీని పండించింది.


120 నుంచి 145 సీట్లు అంటూ..

బంగాళాఖాతంలో అల్పపీడనం..! 23న తుఫానుగా మారి, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు' అంటూ ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్

సాధారణంగా పవన్ కల్యాణ్‌కు ధన్ రాజ్ ఫ్యాన్ కావడంతో అభిమానం కొద్ది అలా కామెంట్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని, సుమారు 120 నుంచి 145 సీట్లు గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేయడంతో ఆ పోస్టును నెటిజన్లు కామెడీగా మార్చారు. రకరకాల కామెంట్లతో హడలెత్తించారు.పోస్టు తొలగింపుతో..

తాను చేసిన పోస్టు గందరగోళం సృష్టిస్తుందనే కారణంతో ధన్ రాజ్ తన పోస్టును తొలగించారు. కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్‌బుక్‌లో కాదు.. జబర్దస్త్‌లో కామెడీ చేయి. అభిమానానికి కూడా హద్దు ఉండాలి అంటూ కామెంట్లను విసిరారు. రకరకాల మెమొలతో సెటైర్లు వేశారు. అయితే ధన్‌రాజ్ ఏదో తెలియక చేశాడా? తెలిసి చేశాడా అనే విషయం మే 23న తేలడం ఖాయమనే అంటున్నారు.

హైపర్ ఆది తర్వాత ధన్ రాజ్ రంగంలోకి..

ఇప్పటి వరకు జనసేనకు అండగా జబర్దస్త్ ఆది మాత్రమే తన అభిమాన స్వరాన్ని వినిపించే వారు. జనసేనకు బాహాటంగా మద్దతు తెలిపినట్టు మరోకరు కనిపించలేదు. తాజాగా ధన్‌రాజ్ ఆ జాబితాలో చేరిపోయారు. మున్ముందు పవన్ కల్యాణ్‌కు ఇంకా ఎవరు అండగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.


Monday, 13 May 2019

పదవ తరగతి ఫలితాలలో నిజామాబాద్‌‌ ఎస్‌‌.ఆర్‌‌. ప్రైమ్‌‌ విద్యార్థుల హవా

నిజామాబాద్‌‌ వార్త:
ఈరోజు వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో  ఎస్సార్ విద్యాసంస్థల నుండి 17 మంది విద్యార్థులు  10 జి.పి. ఏ సాధించారు.  అంకిత,  శ్రేయస్ రెడ్డి, భావిక రెడ్డి,  బి.హరిప్రియ, యస్. సాత్విక్ ఎస్. శృతి, జే శివాని, బి ప్రిసిల్ల, ఎస్ .మనస్విని ,జి.లహరి, ఎస్. శ్రీ హర్షిత, ఎం. ప్రతిమ, కె అఖిల, జి .శ్రీ లక్ష్మి, జె .ఆర్య,  వి. కార్తీక, టి .వేద లు 10 జి.పి.ఎ సాధించారు. విజయానికి కారణం ఎస్సార్ విద్యాసంస్థల ప్రణాళికబద్ధమైన కార్యచరణ , అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం అందించిన విశిష్టమైన క్రమశిక్షణతో కూడిన భోదన వసతి అని విద్యార్థులు  వారి తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల విజయానికి,వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేయుటకు నిరంతరం కృషి చేస్తూ ఉత్తమ శ్రేణి విద్యాప్రమాణాలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను నెలకొల్పి విద్యారంగంలో విశిష్టమైన సేవలందిస్తున్న ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్, శ్రీ ఎనగందుల వరదా రెడ్డి కి, విద్యాసంస్థల సంతోష్ రెడ్డి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్   విద్యాసంస్థల జోనల్ ఇంచార్జి బి .భగవాన్ రెడ్డి ,ప్రిన్సిపాల్ అనిల్ రాజ్, ప్రణీత్ కుమార్, అధ్యాపక బృందం ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపిన విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం

Sunday, 12 May 2019

ఘనంగా ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌‌ వార్త:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త జన్మదిన వేడుకలను ఆదివారం నగరంలో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు,అనుచరులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వయించారు.  ఉదయం బీజేపీ నాయకులు బైకన్ మధు ఆధ్వర్యంలో మిర్చి కాంపౌండ్ లో గల పేద పిల్లల కు టిపిన్స్  పెట్టారు. అలాగే రెడ్ క్రాస్ లో అమందు విజయ్ కృష్ణ ఆద్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు.    వీక్లీ మార్కెట్ లో అన్న దాన కార్యక్రమం నిర్వయించడం జరిగింది ఈ సందర్భంగా ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా ఇందుర్ లో నగరం పలు సేవ కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్క అభిమానికి,అనుచరుల కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మీ ఆశీర్వాదం తో  భవిష్యత్‌‌లో ఎలాంటి అవసరం ఉన్న అందరికి అందుబాటులో లో ఉంటానని తెలియచేసారు. ఈ సందర్భంగా తన జన్మదినం సందర్భంగా కోటగల్లీ లోని నిరంకార్ బాబా భక్తులు విన్నపం మేరకు నిరంకార్ బాబా  భవన నిర్మాణనికి తన వంతు సహాయంగా లక్ష రూపాయల విరాళం అందచేశారు. ఈ కార్యక్రమంలో  విజయ్‌‌,  లక్ష్మీ నారాయణ,పోలీస్ శ్రీను,కుమార్,మధు,ప్రభాకర్,విష్ణు, భాస్కర్,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

గజమాలతో ధన్‌‌పాల్‌‌ను సన్మానిస్తున్న అభిమానులు

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ధ కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ గుప్త

ఫలితాలు ఎలా వచ్చినా నిరుత్సాహం వద్దు

సిల్వర్‌‌వింగ్స్‌‌ పాఠశాల డైరెక్టర్‌‌ రాహుల్‌‌ భరధ్వాజ

నిజామాబాద్‌‌ వార్త: ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటారని, ఎస్సెస్సీ ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలని సిల్వర్‌‌వింగ్స్‌‌ పాఠశాల డైరెక్టర్‌‌ రాహుల్‌‌ భరధ్వాజ అన్నారు. ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్యాంక్‌‌కాలనీలో గల సిల్వర్‌‌వింగ్స్‌‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఇంటర్‌‌, ఎస్సెస్సీ ఫలితాలు జీవితాల్ని శాసించవని, ఇలాంటి పరీక్షలను మున్ముందు మరెన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.  పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తేనో లేదా ఫెయిల్‌‌ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదన్నారు. ప్రస్తుతం పాఠశాలలు మా విద్యార్థులకు ఇంత మందికి 10 గ్రేడ్స్‌‌ వచ్చాయంటూ ప్రచారం చేసుకోవటాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పడం మానుకొని ఫెయిల్యూర్స్‌‌ను ఎలా తట్టుకోవాలో నేర్పాలన్నారు.  21వ శతాబ్ధంలో మన దేశం ఒక అవకాశాల కేంద్రమని, కానీ ఇప్పుడు ‘నాస్కామ్‌‌’ నివేదిక ప్రకారం ఇండియాలో 94% మంది ఇంజనీరింగ్‌‌ విద్యార్థులు ఉద్యోగాలకు అర్హులు కారని చెప్పడం విచారకరమన్నారు. ప్రస్తుతం అన్ని బహులజాతీయ కంపెనీలు 4‒సిలు  (క్రియేటివిటి, కొలాబ్రేషన్‌‌, క్రిటికల్‌‌ థింకింగ్‌‌, కమ్యూనికేషన్‌‌ స్కిల్స్‌‌) కావాలని కోరుకుంటున్నాయని ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. 90% మార్కులు వచ్చిన వారు గొప్పవారని, 60% శాతం మార్కులు వచ్చిన వారు దేనికీ పనికిరాని వారుగా బావిస్తుంటారని కానీ 60% మార్కులు సాధించిన వారు ఎందరో ప్రపంచ ప్రఖ్యాతులు గడించిన వారున్నారని ఆయన గుర్తు చేశారు. సిల్వర్‌‌ వింగ్స్‌‌ పాఠశాల సరికొత్త పద్దతులు, నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదద్దడానికి సంసిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిల్వర్‌‌వింగ్స్‌‌ పాఠశాల ప్రిన్సిపాల్‌‌ భార్గవ చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పాఠశాల డైరెక్టర్‌‌ రాహుల్‌‌ భరద్వాజThursday, 9 May 2019

ravi prakash forgery case

ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా చూడండి - కలెక్టర్

నిజామాబాద్ వార్త, మే 9:  రైతుల నుండి  సేకరిస్తున్న వరి ధాన్యానికి రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ఎం.ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు.
 గురువారం ఉదయం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోనె సంచులు వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉంచాలని, వాటిని ఎక్కడ నుండి లభిస్తే అక్కడ నుండి తెప్పించాలని తెలిపారు. అదేవిధంగా  ధాన్యం సేకరణలో నిర్ణీత సమయంలో రైతుల నుండి ధాన్యాన్ని తీసుకోవడానికి అవసరమైన అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రవాణా సమస్యలు రాకుండా చూడాలన్నారు. నిర్ణీత సమయంలో  రైతులకు వారి ధాన్యానికి  సంబంధించిన చెల్లింపులను వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ఏ మేరకు నిధులు విడుదల చేయాలో పౌరసరఫరాల కార్పొరేషన్కు ఇండెంట్ పంపించాలని ఏరోజుకారోజు నిధులు విడుదల చేశేలా హైదరాబాద్ అధికారులతో మాట్లాడాలని  సూచించారు. తూకంలో   కడ్తా సమస్యలు రాకుండా చూడాలన్నారు.
ఈ సందర్భంగా  పౌరసరఫరాల శాఖ అధికారులు కలెక్టర్ కు వివరిస్తూ వరంగల్ నుండి 4 లక్షల గన్నీ బ్యాగులు పంపించాలని కోరామని, కరీంనగర్ నుండి  23 లక్షల  బ్యాగులు తెప్పిస్తున్నామని ఇందులో ఇప్పటికే 8 లక్షలు చేరుకున్నయని మరో లక్షన్నర ఈరోజు వస్తున్నాయన్నారు. శాఖ వద్ద 1.25 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముప్పై ఏడు లక్షల బ్యాగులకు గాను   సప్లయర్ నుంచి ఇంకా  15 లక్షలు రావలసినదని ఉందని తెలిపారు. ప్రతిరోజు రెండు లక్షల గన్నీ బ్యాగులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు  112.8 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం ధర చెల్లించామన్నారు. వీలైనంత త్వరగా ధాన్యాన్ని తీసుకోవడంతోపాటు చెల్లింపులు కూడా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి సి ఎస్ ఓ కృష్ణ ప్రసాద్, డి ఎం సి ఎస్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమావేవంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌‌

నిజామాబాద్‌‌ వార్త:  డివిజన్ లో రెండో విడత జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని  జిల్లా కలెక్టర్  ఎం ఆర్ ఎం రావు అన్నారు జిల్లాలో రెండో విడత  జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికలు బోధన్ డివిజన్ లోని 8 మండలాల్లో ఈ నెల 10 వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగతుందనీ చెప్పారు 8  జడ్పీటిసి  లు 75 ఎంపీటీసీ  ఎన్నికలు జరుతాయని చెప్పారు. రెండోవ విడతలో 2 లక్షల  49 మంది ఓటర్లు కాగా అందులో ఒక లక్ష 4 వేల 48 మంది మహిళా ఓటర్లు కాగా 95,వేల 9 వంద 99  మంది పురుష ఓటర్లు ఇద్దరు ట్రాన్స్ జెండర్ కలరు  ఓటర్ ల కోసం 412 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  పోలింగ్ సమర్థ నిర్వహణ కోసం మొత్తం 2859 మంది పోలింగ్ సిబ్బంది ని 20 శాతం అదనంగా కలుపుకొని విధులు నిర్వహిస్తారని అందులో 494 పి వో లు, ఏ పీ ఓ లు 494 ఇతర పోలింగ్ సిబ్బంది 1871 మందిని నియమించినట్లు కలెక్టర్ వివరించారు   ఎండలు తీవ్రంగాఉన్నందున  ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలుగకుండా చల్లటి త్రాగునీరు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స కేంద్రం ఎలక్ట్రిసిటీ నిరంతర సరఫరా ఏర్పాట్లు చేయడం జరిగిందని అదేవిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్ చైర్స్ ,ర్యమ్స్ కూడా ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు
గత ఎన్నికల లో జరిగిన సంఘటనలు పోటీలో ఉన్న అభ్యర్థుల బట్టి డివిజన్ లో 170 సున్నిత అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి నందున అక్కడ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు  33 లోకేశన్ల లో సూక్ష్మ పరిశీలకులను 62 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్  108 పోలింగ్ కేంద్రాల్లో వీడియో గ్రాఫీ   ఈ డివిజన్ లో జడ్పీటిసి  ఎంపిటిసి లకు ఒక్కటి కూడా ఏకగ్రీవం గా ఎన్నిక కాలేదని జిల్లా కలెక్టర్ వివరించారు..జడ్పీటిసి బ్యాలెట్ white  కలర్ఎంపిటిసి బ్యాలెట్ పేపర్  పింక్ కలర్ లో ఉంటాయని  కలెక్టర్ చెప్పారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు


రెండో విడత బోధన్ డివిజన్ జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు

నిజామాబాద్‌‌ వార్త: 

రెండో విడత బోధన్ డివిజన్ జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు
 తేదీ 10-05-2019.
                 
జడ్పీటిసి  08         23 పోటీలో
ఎంపిటిసి  75.       216   "                     
పి యస్.              412
పి ఓ                     494
ఏపీ ఓ.                 494
సిబ్బంది.            1871
       మొత్తం.       2859
వీడియో గ్రఫి.        108
Web casting.      62
Micro obsers.     33
       ఏకగ్రీవం.    నీల్
 ఓటర్లు.           2,00 049
,మహిళ           1,04,048
పు.                     95,999
ఇతరులు.                   02
వల్బరెబు ల్ 170(సున్నిత అతి సున్నిత)33  లోకేషన్స్

Wednesday, 8 May 2019

విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఎస్‌‌.ఎఫ్‌‌.ఐ విద్యార్థుల ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన 

నిజామాబాద్‌‌ వార్త:  విద్యార్థుల హక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాలరాస్తున్నారని నగర కార్యదర్శి మహేష్ అన్నారు ఈ మేరకు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొన్న వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జరిగిన తప్పులను అవకతవకలకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన బస్టాండ్ ఎదుట నిర్వహించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ అనుభవం లేని globarena సంస్థకు వ్యక్తిగత లబ్ధికోసం కాంట్రాక్టు ఇచ్చి రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణమైన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ని జగదీశ్వర్ రెడ్డి ని వెంటనే విధుల నుండి బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గత నాలుగు రోజుల నుండి శాంతియుతంగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తుంటే భగ్నం చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. అదే విధంగా గత 15 రోజులుగా చేస్తున్న ఆందోళనలు నీరుగార్చే విధంగా త్రిసభ్య కమిటీ వేశారు అయితే ఆ త్రిసభ్య కమిటీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ఇప్పటికైనా ఇంటర్ బోర్డు పరీక్షలలో తప్పుడు ఫలితాలకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని బాధిత విద్యార్థిని కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారుతి వేణుగోపాల్ శశికాంత్ సాయి సతీష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌‌.ఎఫ్‌‌.ఐ విద్యార్తులుఎండలో పిల్లలను బయటకు పంపకండి,

ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు  డాక్టర్ బి కేశవులు

నిజామాబాద్‌‌ వార్త: దేశంలో రాష్ట్రంలో సూర్యుని ప్రతాపం భగభగ లాడుతోంది,పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్లయినా సరే బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు , ఇంతటి ఉష్ణోగ్రత లో పిల్లలు ,పెద్దలు  బయటకి వెళ్లక పోవడమే చాలా మంచిదని మనో విజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్రముఖ సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు అన్నారు,
రాష్ట్రంలో  ” పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు - వడదెబ్బ పరిణామాలు ““ అంశాలపై  ఖలీల్ వాడి లోని మనో విజ్ఞాన వేదిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు,
పిల్లలలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రాలు పిల్లలలో బలహీనంగా ఉండటం మూలాన వడదెబ్బకు గురి అయ్యే కాశాలు అధికము, చిన్నపిల్లల్లో శరీరంలోని నీటి పరిమాణము కూడా చాలా తక్కువ అయితే అధిక శరీర ఉష్ణోగ్రతలు మరియు చిన్న పిల్లలలో శరీరంలోని  తక్కువగా ఉన్న నీరు ఎక్కువగా  ఆవిరైపోతుంది అంతేకాకుండా 104 ఉష్ణోగ్రతలు దాటిన  సందర్భాలలో ఫిట్స్  వచ్చే అవకాశం చిన్న పిల్లలలో ఎక్కువగా ఉంటుందని  డాక్టర్ కేశవులు తెలిపారు,
బయటకు వెళ్లాలంటే అవసరమనుకుంటేనే వెళ్లాలని అలాగే ద్రవపదార్థాలు తీసుకోవాలని, పండ్లు కూరగాయలు రసాలు తీసుకోవడం చాలా మంచిది అన్నారు,
 అట్లానే పరిశుభ్రమైన నీరు  ఆహారము తాజా గా ఉన్నప్పుడే తినాలని, బయట దొరికే జ్యూస్ గానీ పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్ బి కేశవులు ప్రజలను హెచ్చరించారు,
చాలామందికి  శరీరంపై బొబ్బలు రావడం తలనొప్పి, నిస్సత్తువగా ఉండటం ,వాంతులు, తలనొప్పి, కాళ్లు  పట్టుకోవడము, చేతులు చల్లబడటం, ఆందోళనకు గురికావడం  లాంటివి వడదెబ్బ లక్షణాలని వీటికి దూరంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రజలకు డాక్టర్ కేశవులు వివరించారు,
అయితే ఎండలో  ఎలాంటిఆటలు ఆడుకోవద్దని వ్యాయాయం లాంటివి చేయకూడదని మద్యము , మత్తు పదార్థాలకు, ఫాస్ట్ ఫుడ్ పదార్థాలకు దూరంగా ఉండవలెనని సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకూడదని, చల్ల పడిన తర్వాతే  దానికి ప్రయత్నించాలని  ప్రజలకు  డాక్టర్ కేశవులు సూచించారు
ఇంకా క్రమంలో విజ్ఞాన వేదిక కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచే వచ్చిన రోగుల బంధువులు  పెద్దఎత్తున పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్‌‌ కేశవులు

టీఆర్‌‌టీ అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలి

జిల్లా కలెక్టరేట్ ఎదుట  టిఆర్టి అభ్యర్థులు నిరసన 

నిజామాబాద్‌‌ వార్త:  టి ఆర్ టి 2017 నియామకాల గురించి పాఠశాల పునఃప్రారంభం లోపు 1:1 లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయాలని కోరుతూ టిఆర్టి అభ్యర్థులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టిఆర్టి అభ్యర్థులు మాట్లాడుతూ.. టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు నియామకాల పైన ఇలాంటి ప్రకటనలు రాలేదన్నారు దీంతో తాము ఎంతో మనో వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేలాది రూపాయలు వెచ్చించి ఉన్నత చదువులు చదివి కోచింగ్ తీసుకుని దానితో కుటుంబంపై ఆర్థిక భారం పెరిగి జీవించడం చాలా కష్టతరంగా మారింది అన్నారు. పెళ్లిళ్లు కూడా నియామకాల తో ముడిపడి ఉన్నాయని, సెలక్ట్ అయిన అభ్యర్దులు ఉండగా విద్యా వాలంటీర్లను తీసుకుంటామని ప్రకటన రావడంతో మరింత పెరిగి పోయిందని ఆవేదన చెందుతున్నామని అన్నారు. కావున టిఆర్టి 2017 నియామకాలు ఈ సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం చేపట్టాల్సిందిగా తమ ద్వారా కోరుతున్నామన్నారు.

కలెక్టరేట్‌‌ ఎదుట ఆందోళన చేస్తున్న టీఆర్‌‌టీ అభ్య్థులు

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌‌ చేయండి...

రెండవ విడత ఎన్నికలకు సిబ్బంది

నిజామాబాద్ వార్త:  రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపు  పూర్తి చేశారు.
బుధవారం  ప్రగతి భవన్ లోని ఎన్ఐసీలో సాధారణ పరిశీలకురాలు అభిలాష్ బిస్తూ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎం ఆర్ ఎం రావు, సత్యనారాయణల ఆధ్వర్యంలో  పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని కేటాయిస్తూ 3వ ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో ఈనెల  10న జరిగే  రెండవ విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి  412 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. ఇందుకు 494 మంది ప్రిసైడింగ్  అధికారులు, 494 సహాయ పి వో లు, 1871 ఓ పి ఓ లను కేటాయిస్తూ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు.
కామారెడ్డి జిల్లా కు సంబంధించి బాన్స్వాడ డివిజన్లో జరిగే రెండో విడత ఎన్నికలకు కూడా సిబ్బంది కేటాయింపు పూర్తి చేశారు 426 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 511 పిఓ ,511  ఏ పి ఓ లు, 1916  ఓ పి  వో లను కేటాయిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో  డి  ఆర్ ఓ  అంజయ్య, జిల్లా పరిషత్ సి  ఈ ఓ వేణు, కామారెడ్డి లైజన్  అధికారి  సాయన్న  తదితరులు పాల్గొన్నారు.

రెండవ విడత ర్యాండమైజేషన్‌‌ను పరిశీలిస్తున్న అభిలాష్‌‌ భిష్టు

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు పక్కాగా ఉండాలి - కలెక్టర్

నిజామాబాద్ వార్త:  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  బ్యాలెట్  బాక్సులు భద్రపరిచిన గదుల వద్ద గట్టి బందోబస్తు ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన స్థానిక నిర్మల హృదయ పాఠశాలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను పరిశీలించారు.స్ట్రాంగ్ రూములు ఉన్న అంతస్తులలో గన్మెన్లను ఏర్పాటు చేయాలని 24 గంటలు  నిశిత పరిశీలన ఉండేలా చూడాలన్నారు. విజిటర్స్ రిజిస్టర్లో  గుర్తింపు కార్డులు ఉన్నవారిని అనుమతించాలని తెలిపారు. రిజిస్టర్లో వారి వివరాలను నమోదు చేయించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయానికల్లా అన్ని కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు, రావడానికి, వెళ్లడానికి వేరు వేరు దారులకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన సమాచారం అందించడానికి ల్యాండ్ ఫోన్ తో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సీఈవో for వేణును ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేసి  అందరూ వాటిని ప్రదర్శించేలా చూడాలన్నారు.

స్ట్రాంగ్‌‌ రూంను పరిశీలిస్తున్న కలెక్టర్‌‌

అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న కలెక్టర్‌‌

జవాబు పత్రాల స్కానింగ్ త్వరగా పూర్తి చేయాలి - కలెక్టర్

నిజామాబాద్ వార్త:  ఇంటర్మీడియట్ జవాబు పత్రాల పునః పరిశీలనకు సంబంధించి స్కానింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు  ఇంటర్మీడియట్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన ఇంటర్మీడియట్ కార్యాలయంలో పర్యటించి జవాబు పత్రాల పునః మూల్యాంకన కు సంబంధించి పనులను పరిశీలించారు. 57 వేల జవాబు పత్రాల పునః పరిశీలన పూర్తయిందని వాటి స్కానింగ్ పనులు సుమారు 50 శాతం పూర్తవుతుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, స్కానింగ్ పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన మరిన్ని స్కానర్లను కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. తప్పులకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేని వారిని లోపలికి అనుమతించవద్దని ఈ విధులు నిర్వహించే వారికి గుర్తింపు కార్డులు ఉండేలా చూడాలని తెలిపారు.
 కలెక్టర్ వెంట  జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్‌‌ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌‌

ఇంటర్మీడియట్‌‌ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌‌

సిఎంసి లో పర్యటించిన కలెక్టర్

నిజామాబాద్‌ వార్త:  పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన డిచ్పల్లి లో ని సీఎం సీ ని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్ ఎం రావు పర్యటించి పరిశీలించారు.
  బుధవారం ఆయన  క్రిస్టియన్ కళాశాలలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవిఎంలను  భద్రపరిచిన రూములను వాటికి వేసిన సీల్ లను పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందిని, అందుబాటులో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్ రిజిస్టర్లో  పర్యటించిన వారి వివరాలను పరిశీలించారు. రిజిస్టర్లో తాను పర్యటించిన వివరాలను నమోదు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని ఇతరులను అనుమతించకూడదని, సెల్ఫోన్లను వెంట తీసుకవెళ్లవద్దని ముందే చెప్పాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ లకు ఉన్న సీళ్లను జాగ్రత్తగా గమనిస్తుండాలని భవనంలోకి ముందస్తు అనుమతి గుర్తింపు కార్డు ఉన్నవారు ఎవరెవరు వస్తున్నారో వారి వివరాలను తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేయించాలని ఆయన సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు.
 కలెక్టర్ వెంట డిఆర్ఓ అంజయ్య ఉన్నారు


Tuesday, 7 May 2019

పసిహృదయాలకు ఎంత బాధ వచ్చింది..?

కల్లాకపటం తెలియని పిల్లలకి ఎంత బాధ వచ్చిందో .. అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. కన్నతల్లి మృతదేహం వద్ద  అమాయకులైన ఈ పసిపిల్లలను చూస్తుంటే ఎంతటి కఠిన హృదయమైన కరిగిపోవాల్సిందే.. హృదయవిదారకమైన ఈ ఫొటోను సోషల్‌‌ సర్వీస్‌‌ ఇండియా వారు తన ఫేస్‌‌బుక్‌‌ పేజీలో పోస్ట్‌‌ చేశారు. ఎందుకో అది చూడగానే నాకూ షేర్‌‌ చేయాలనిపించింది.  అమ్మ విలువ తెలిసిన వారు తప్పకుండా షేర్ చేయండి.నాగారం శ్రీ లక్ష్మీకుబేరస్వామి ఆలయంలో పూజలు

  నిజామాబాద్‌‌ వార్త: నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని నాగారంలో శ్రీ లక్ష్మీ కుబేరస్వామి ఆలయంలో శ్రీమతి గుజ్జరాజేశ్వరి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలిసంఘం మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఘనంగా అక్షయతృతీయ వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో వేదపండితులు గంగాధర్‌‌ శర్మ కుబేర వ్రతం, కుబేర హోమం, కుబేర ప్రవచనం, కుంకుమార్చన, దూపదీప నైవేద్యము, మహా ప్రసాదము తదితరల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరమేయర్‌‌ ఆకుల సుజాత ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజ్జరాజేశ్వరి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ సహిత కుబేర స్వామి ఆలయంలో చాలా అరుదుగా ఉంటుందని, అది మన నిజామాబాద్‌‌ నగరంలో ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న సంతాన లక్ష్మి దేవికి పూజలు చేసినట్లైతే సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుందన్నారు.

శ్రీ లక్ష్మీకుబేర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మేయర్‌‌ ఆకుల సుజాత

పూజలలో పాల్గొన్న పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి
మేయర్‌‌ ఆకుల సుజాతను సన్మానిస్తున్న ఆలయకమిటి అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి

పూజలలో పాల్గొన్న భక్తులు

పూజలలో పాల్గొన్న భక్తులు

నాగారంలోని శ్రీ లక్ష్మీకుబేర స్వామి ఆలయం

కొలువైన సంతాన లక్ష్మి
ఘనంగా మహాత్మా బసవేశ్వర 886 వ జయంతి కార్యక్రమం

 నిజామాబాద్‌‌ వార్త: నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజుల్‌‌పేట్‌‌లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వీరశైవ లింగాయత్  ఆధ్వర్యంలో  మంగళవారం మహాత్మా బసవేశ్వర 886 వ జయంతిని ఘనంగా ఘనంగా నిర్వహించారు.  వీరశైవ లింగాయత్ సభ్యులందరు కలెక్టర్ ఆఫీస్ లోని ప్రగతి భవన్ కు ర్యాలీ గా వెళ్లారు. ప్రభుత్వం తరఫున జిల్లా  కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు బసవేశ్వరునికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి బసవ జయంతి ని అధికారికంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా గాజుల్‌‌పేట్‌‌  వీరశైవ  లింగాయత్ సంఘం సభ్యులు  బస్వరాజ్,రాజకుమార్,  పండరి,  సురేష్, సంతోష్, శంకర్, సంగప్ప,  కాశీనాథ్ అప్ప, సిద్ది రామప్ప, వినోద్ తదితరులు  బసవేశ్వరుడి విగ్రహం కోసం స్థలం, అలాగే లింగాయత్‌‌ సంఘం స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని కలెక్టర్‌‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం  గాజుల్‌‌పేట్‌‌లోని  శ్రీ వీరభద్ర స్వామి ఆలయం చేరుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ  కార్యక్రమంలోలింగాయత్‌‌ సమన్వయ సమితి జిల్లా సెక్రెటరీ బస్వరాజ్, నగరంలోని వీరశైవలింగాయత్‌‌లు పాల్గొన్నారు.


బసవేశ్వర జయంతిలో పాల్గొన్న వీరశైవలింగాయత్‌‌లు

బసవేశ్వరునికి పూలమాల వేస్తున్న లింగాయత్‌‌ సమన్వయ సమితి జిల్లా సెక్రెటరీ బస్వరాజ్‌‌
వీరభద్రస్వామి